Post Office Scheme: ఏ కష్టాలు, ఏ ఇబ్బందులు లేకుండా ప్రస్తుతం జీవనం సాఫీగా సాగుతోందని భవిష్యత్‌పై ప్రణాళికలు లేకుండా ఉంటే మీరు ఇబ్బందులు పడాల్సిందే. ప్రస్తుతం ఆదాయవసరాలు తీర్చుకుంటూనే భవిష్యత్‌కు ప్రణాళికలు వేసుకోవాలి. ఎప్పుడూ ఏం జరుగుతుందో చెప్పలేం. బాగున్న సమయంలోనే భవిష్యత్‌లో స్థిరంగా ఆదాయం వచ్చే మార్గాలు చూసుకోవాలి. అంటే పని చేయకున్నా ఆదాయం వచ్చేలా ముందే ఏర్పాట్లు చేసుకోవాలి. భవిష్యత్‌పై బెంగ లేకుండా ఉండేందుకు తపాలా శాఖ అద్భుత పథకం ఒకటి అందిస్తోంది. నెలవారి ఆదాయ ఖాతా (మంత్లీ ఇన్‌కమ్ అకౌంట్) ద్వారా నెలకు రూ.5 వేలు పొందవచ్చు. ఈ పథకం వివరాలు.. ఎలా పొందవచ్చో సమగ్ర కథనం ఇది.
Also Read: Pink Tax: పురుషుల కంటే మహిళలకే అధిక ధరలు.. అసలు 'పింక్ ట్యాక్స్' అంటే ఏమిటో తెలుసా?
జాతీయ పొదుపు నెలసరి ఆదాయ ఖాతాగా పిలిచే ఈ పథకంలో ఎవరైనా చేరవచ్చు. డిపాజిట్ రూపంలో ఒకసారి పెట్టుబడి పెడితే తర్వాత స్థిరమైన ఆదాయం ప్రతి నెలా పొందవచ్చు. క్రమంగా ఆదాయం కావాలనుకునే వారికి ఈ పథకం ఎంతో ప్రయోజనకరం. పథకంలో ఒకరి పేరిట రూ.4.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. వీటిల్లో పెట్టుబడి పెట్టిన వారికి ఐదేళ్ల వరకు నెలవారీ వడ్డీ చెల్లింపు చేస్తారు. రూ.1,500 మొత్తాల్లో పెట్టుబడి పెట్టే వీలుంటుంది. ప్రస్తుతం నెలవారీ వడ్డీ 7.3 శాతం వరకు చెల్లిస్తున్నారు.
Also Read: X TV App: ఎలన్ మస్క్ మరో సంచలనం.. యూట్యూబ్‌కు పోటీగా టీవీల్లోనూ 'ఎక్స్' ట్విట్టర్
నెలవారీ ఆదాయ ఖాతా వివరాలు..
కనిష్టంగా రూ.వెయ్యి నుంచి గరిష్టంగా రూ.4.5 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు. ఉమ్మడిగా అయితే (గరిష్టంగా ముగ్గురు) రూ.9 లక్షల వరకు డిపాజిట్ చేయొచ్చు. స్కీమ్ మెచ్చూరిటీ కాలం ఐదేళ్లు. ఐదేళ్ల కాల పరిమితి తర్వాత నెలవారీ వడ్డీతో కలిపి రాబడి వస్తుంది. వచ్చిన రాబడి పొదుపు ఖాతాలో దానంతట అదే జమ అవుతుంది. దీనికి సంబంధించిన వివరాలు తపాలా కార్యాలయంలో పొందవచ్చు. ఒకసారి పెట్టుబడి పెట్టిన తర్వాత నెలవారీ ఆదాయ పథకం ద్వారా నెలకు గరిష్టంగా రూ.5,550 వరకు పొందవచ్చు. ఉమ్మడి ఖాతా ఉన్నవారికైతే రూ.9,250 పొందుతారు.
పెట్టుబడి ఎంత పెట్టాలి?
కనీసం రూ.వెయ్యితో ఖాతా తెరవచ్చు. ఒక వ్యక్తి గరిష్ట పరిమితి రూ.9 లక్షలు. ఉమ్మడి ఖాతా అయితే (ముగ్గురు) గరిష్టంగా రూ.15 లక్షలు పెట్టవచ్చు.
నెలవారీ ఆదాయ ఖాతా వడ్డీ రేటు
ఈ ఖాతా తెరిచిన వారికి సంవత్సరానికి 7.4 శాతం వడ్డీ చెల్లిస్తారు. ఖాతా తెరిచిన ఒక నెల తర్వాత మెచ్యూరిటీ వరకు వడ్డీ చెల్లింపు ఉంటుంది.
మెచ్యూరిటీ వ్యవధి
ఐదేళ్లు. అయితే మెచ్యూరిటీ తేదీకి ముందే ఖాతాదారు మరణిస్తే ఆ ఖాతాను మూసివేస్తారు. అప్పటివరకు పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని నామినీ లేదా వారి వారసులకు చెల్లిస్తారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter