Gas Cylinder Cashback Offer: ప్రస్తుతం పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా ప్రతి ఒక్కరు నెలనెల బడ్జెట్ ప్లాన్ వేసుకుంటున్నారు. మన ఆదాయాన్ని బట్టి ఇంట్లో ఖర్చు చేస్తున్నారు. ఒకవైపు ఈ ద్రవ్యోల్బణం కాలంలో పొదుపు చేయలేని స్థితి ఏర్పడుతుంది. సంపాదనలో అధిక భాగం వారి రోజువారీ ఖర్చులకే పోతోంది. ఈ ఖర్చులలో వంటగది ఖర్చు కూడా చాలా ముఖ్యమైంది. వంటింట్లోకి మనం రోజూ ఏదో వస్తువు తీసుకువస్తునే ఉంటాం. వంటగది ఖర్చులలో గ్యాస్ సిలిండర్ ధర చాలా ముఖ్యమైంది .
పూర్వ కాలంలో మన ఇళ్లలో కట్టెలతో పొయ్యి మండేది. ఆ తరువాత స్టవ్ స్థానంలో గ్యాస్ సిలిండర్, గ్యాస్ స్టవ్ వచ్చాయి. ప్రస్తుతం ప్రతి ఇంట్లో దాదాపు గ్యాస్ సిలిండర్ కచ్చితంగా ఉంటోంది. ఇదే సమయంలో గ్యాస్ సిలిండర్ల ధరలు కూడా పెరుగుతున్నాయి.
గత రోజులగా ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడంతో ప్రజల జేబులకు చిల్లు పడింది. అయితే ఇప్పుడు ఆన్‌లైన్‌లో గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేస్తే.. సిలిండర్ ధరలో కొంత ఉపశమనం పొందవచ్చు. అనేక ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ బుకింగ్‌పై క్యాష్‌బ్యాక్‌ను అందిస్తున్నాయి.
క్యాష్‌బ్యాక్ ఈ క్యాష్‌బ్యాక్ ద్వారా ఎల్‌పీజీ సిలిండర్ ధరపై తగ్గింపును పొందవచ్చు. ఇప్పుడు ఫోన్ పే, పేటీఎం వంటి ఆన్‌లైన్ చెల్లింపు ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఇలాంటి డిస్కౌంట్లను మీరు పొందవచ్చు. ఇక్కడ నుంచి ఆన్‌లైన్ సిలిండర్ బుకింగ్‌పై క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ఉన్నాయి. ఈ యాప్‌ల ద్వారా సిలిండర్‌ను బుక్ చేయడానికి.. మీరు ఈ యాప్‌లను సందర్శించండి. సిలిండర్‌ను బుక్ చేసుకునే విధానాన్ని అనుసరించి క్యాష్ బ్యాక్ పొందండి.
Also Read: Jharkhand Murder Case: పెళ్లైన పది రోజులకే దారుణం.. శ్రద్ధా హత్య తరహాలోనే జార్ఖండ్‌లో ఘోరం
Also Read: FD Interest Rates: ఎస్‌బీఐ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఎఫ్‌డీ వడ్డీ రేట్లు పెంపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook