Interesting Facts About CIBIL: ఏయే సందర్భాల్లో సిబిల్ స్కోర్ పడిపోతుందో తెలుసా ?

Interesting Facts About CIBIL Score : క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో అనేది సిబిల్ స్కోర్ పడిపోవడంలో ఒక ముఖ్యమైన అంశం. క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో అంటే ఏంటంటే.. మీ క్రెడిట్ కార్డులను విచ్చలవిడిగా ఉపయోగిస్తే మీ క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో భారీగా పెరిగిపోతుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన అంశాల కోసం ఈ కథనం పూర్తిగా చదవండి.

Written by - Pavan | Last Updated : Aug 9, 2023, 05:56 PM IST
Interesting Facts About CIBIL: ఏయే సందర్భాల్లో సిబిల్ స్కోర్ పడిపోతుందో తెలుసా ?

Interesting Facts About CIBIL Score : సిబిల్ స్కోర్ ఎంత ఎక్కువ ఉంటే మీ క్రెడిట్ హిస్టరీ అంత బాగున్నట్టు అనే విషయం తెలిసిందే కదా. సిబిల్ స్కోర్ అంటే మీ క్రెడిట్ హిస్టరీ రిపోర్ట్ ఎలా ఉందనే విషయంలో 300 పాయింట్స్ నుంచి 900 పాయింట్స్ మధ్య మీకు ట్రాన్స్‌యూనియన్ సిబిల్ ఇచ్చే స్కోర్‌నే సిబిల్ స్కోర్ అంటారు. దీనినే క్రెడిట్ స్కోర్ అని కూడా పిలుస్తారు. కనీసం 750 కంటే ఎక్కువ ఉంటేనే మీకు ఏదైనా బ్యాంకు ఏవైనా లోన్స్ కానీ లేదా క్రెడిట్ కార్డులు కానీ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాదు.. బ్యాంకులు మీకు ఎక్కువగా కొర్రీలు పెట్టకుండా .. మీతో ఎక్కువగా విభేదించకుండా .. మీరు అర్హులైనంత మేరలో మీరు అడిగినంత మొత్తాన్ని రుణంగా ఇవ్వలన్నా మీకు చాలా మెరుగైన సిబిల్ స్కోర్ ఉండాల్సిందే. మీరు తీసుకునే లోన్‌పై వడ్డీ రేటు సైతం అంతే. మెరుగైన సిబిల్ స్కోర్ ఉంటేనే తక్కువ వడ్డీ రేటుకి లోన్ లభిస్తుంది. లేదంటే బ్యాంకు ఎంత చార్జ్ చేస్తే అంత చెల్లించాల్సి ఉంటుంది.

ఎలాంటి తప్పిదాల వల్ల సిబిల్ స్కోర్ పడిపోతుంది ?
క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో అనేది సిబిల్ స్కోర్ పడిపోవడంలో ఒక ముఖ్యమైన అంశం. క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో అంటే ఏంటంటే.. మీ క్రెడిట్ కార్డులను విచ్చలవిడిగా ఉపయోగిస్తే మీ క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో భారీగా పెరిగిపోతుంది. అలా కాకుండా కొంత పొదుపులో ఉంటూ మీ క్రెడిట్ కార్డు వినియోగం ఆ కార్డుకు ఉండే పరిమితిలో 30 శాతానికి మించకుండా ఉండేలా చూసుకోవాలి. అలా ఉపయోగించిన మొత్తాన్ని తిరిగి సకాలంలో చెల్లించకపోయినా మీ సిబిల్ స్కోర్ పడిపోతుంది.

క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో :

క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో 30 శాతం మించిపోయిందంటే.. మీపై అప్పు భారం ఎక్కువగా పెరుగుతుందని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో మీ సిబిల్ స్కోర్ తగ్గిపోవడమే కాదు.. క్రెడిట్ కార్డుపై వాడిన మొత్తాన్ని తిరిగి చెల్లించడంలో ఏదైనా జాప్యం జరిగితే.. అది మీ రీపేమేంట్ హిస్టరీ కూడా డ్యామేజ్ అయ్యేలా చేస్తుంది.

సకాలంలో క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించకపోవడం :
మీ క్రెడిట్ కార్డు బిల్లు డ్యూ డేట్ లోగా చెల్లించడం అనేది ఎంతో ముఖ్యం. డ్యూడేట్ లోగా బిల్లు చెల్లించకపోతే ఆ బిల్లు మొత్తంపై వడ్డీ పడటంతో పాటు తదుపరి బిల్లులో లేట్ ఫీజు కూడా యాడ్ అవుతుంది. అన్నింటికిమించి మీ సిబిల్ స్కోర్ తగ్గిపోతుంది. 

చాలా ఎక్కువ క్రెడిట్ కార్డులు కలిగి ఉండటం :
చాలా ఎక్కువ క్రెడిట్ కార్డులు కలిగి ఉండటాన్ని సిబిల్ స్కోర్ నిర్ధారించే ట్రాన్స్‌యూనియన్ ఆయా కస్టమర్స్ ఆర్థిక స్తోమతను తక్కువ అంచనా వేసే ప్రమాదం ఉంది. అది మీ సిబిల్ స్కోర్ తగ్గిపోయేలా చేస్తుంది.

లోన్ ఇఎంఐ చెల్లింపులు : 
తీసుకున్న రుణాలని సకాలంలో ఇఎంఐ రూపంలో చెల్లించడం మర్చిపోవద్దు. లోన్ ఇఎంఐ చెల్లించకపోతే ఆ చెక్ బౌన్స్ అవడంతో పాటు అధిక వడ్డీ, చెక్ బౌన్స్ చార్జీలు, కొన్నిసార్లు లేట్ ఫీజు లాంటి అపరాధ రుసుం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇలాంటి సందర్భాల్లోనూ సిబిల్ స్కోర్ పడిపోతుంది.

ఒకటికి మించి ఎక్కువ పెండింగ్ :
క్రిడిట్ కార్డు బిల్స్ అయినా లేదా లోన్ ఇఎంఐ అయినా సకాలంలో చెల్లించడం చాలా ముఖ్యం. అలా ఒకటికి మించి ఎన్ని లోన్స్, క్రెడిట్ కార్డులు బిల్స్, ఇఎంఐలు పెండింగ్ ఉంటే.. మీ సిబిల్ స్కోర్ అంత దారుణంగా పడిపోతుంది. అలా ఎంత ఎక్కువ కాలం పెండింగ్ లో ఉంటే అంత ఎక్కువ సిబిల్ స్కోర్ డ్యామేజ్ అవుతుంది.

ఇది కూడా చదవండి : Elon Musk House: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్

సెక్యూర్డ్ లోన్స్, అన్‌సెక్యూర్డ్ లోన్స్ :  
మీరు తీసుకునే రుణాల్లో అన్ని అన్‌సెక్యూర్డ్ లోన్స్ అని కాకుండా కొన్ని సెక్యుర్డ్ లోన్స్ కూడా ఉండటం మంచిది. అన్‌సెక్యూర్డ్ లోన్స్ అంటే ఏ సెక్యురిటీ లేకుండానే మీకు మీ సిబిల్ స్కోర్, మీ ఆదాయ వనరులు చూసి బ్యాంకులు ఇచ్చేవి. సెక్యూర్డ్ లోన్స్ అంటే సిబిల్ స్కోర్‌తో సంబంధం లేకుండా ఏవైనా విలువైనవి తనఖా పెట్టుకుని ఇచ్చేవి. సెక్యూర్డ్ లోన్స్, అన్‌సెక్యూర్డ్ లోన్స్ .. ఈ రెండింటి కలయిక మీ సిబిల్ స్కోర్ పెరిగేలా చేస్తుంది. మీ సిబిల్ స్కోర్ పడిపోకుండా ఉండాలంటే ఈ పొరపాట్లు చేయకుండా చూసుకోండి.

ఇది కూడా చదవండి : Credit Cards Usage: క్రెడిట్ కార్డులతో కలిగే లాభాలు ఏంటో తెలుసా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News