WhatsApp introduce More emojis reactions soon: వినియోగదారులకు తాజాగా మరిన్ని రియాక్షన్స్ ఎమోజీలను వాట్సాప్ ఇవ్వననుంది. గతంలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ రియాక్షన్స్ ఎమోజీలను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అదే తరహాలో ప్రముఖ సోషల్ మీడియా వాట్సాప్ మరిన్ని రియాక్షన్ ఎమోజీలను వినియోగదారులకు పరిచయం చేయనున్నట్లు సమాచారం తెలుస్తోంది. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా వాట్సాప్ కొత్త ఫీచర్లను తీసుకొస్తూ వినియోగదారులకు ఆకర్షణీయంగా నిలుస్తోంది.
యూజర్లకు ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తే.. మెసేజ్‌లకు డిఫరెంట్ స్టైల్‌లో రియాక్షన్ ఎమోజీలతో రిప్లే ఇవ్వొచ్చని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను బీటా వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు సమాచారం. తరువాత ఈ రియాక్షన్ ఎమోజీలను ఇతర వాట్సాప్ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురాననుట్లు వాబీటాఇన్ఫో పేర్కొంది.
వాబీటాఇన్ఫో అందించిన సమాచారం ప్రకారం... వాట్సాప్‌లో ప్రస్తుతం ఆరు ఎమోజీ రియాక్షన్ ఫీచర్లు (లైక్, లవ్, లాఫ్, ఆశ్చర్యం, విచారం, ధన్యవాదాలు) మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వినియోగదారుల కోరిక మేరకు మరిన్ని రియాక్షన్ ఎమోజీలను తీసుకువచ్చేందుకు వాట్సాప్ కీలక నిర్ణయం తీసుకుందని సమాచారం. ప్రస్తుతం ఈ సరికొత్త ఫీచర్ ప్రయోగాత్మక దశలో ఉందని ప్రముఖ సోషల్ మీడియా సంస్థ వాట్సాప్ తెలిపింది. ఈ ఫీచర్‌ను కూడా ఇతర వాట్సాప్ యూజర్లకు తీసుకువచ్చినట్లే అప్‌డేట్ డెస్క్‌టాప్ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురాననుట్లు సంస్థ వెల్లడించింది.
Also Raed: Yuzvendra Chahal: అది ఎలా వైడ్ అవుద్ది.. అంపైర్‌తో వాగ్వాదానికి దిగిన యుజ్వేంద్ర చహల్ (వీడియో)
Also Read: Yuzvendra Chahal: అది ఎలా వైడ్ అవుద్ది.. అంపైర్‌తో వాగ్వాదానికి దిగిన యుజ్వేంద్ర చహల్ (వీడియో)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook