Whatsapp New Features: ప్రముఖ సోషల్ మీడియా మెస్సేజింగ్ యాప్ వాట్సప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లు ప్రవేశపెడుతుంటుంది. కొత్తగా ప్రవేశపెట్టిన ఆ మూడు ఫీచర్లు మీ చాటింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింతగా పెంచుతాయి..
ఇన్‌స్టంట్ మెస్సేజింగ్ యాప్‌గా ప్రాచుర్యంలో ఉన్న వాట్సప్ ఇటీవల యూజర్ల కోసం అద్భుతమైన కొత్త ఫీచర్లను అందుబాటులో తీసుకొచ్చింది. యూజర్ల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని వాట్సప్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లు అందుబాటులో తెస్తుంటోంది. ఆ ఫీచర్లను ఒకసారి ట్రై చేస్తే..ఇక వదిలిపెట్టరు. మీ చాటింగ్ అనుభూతిని మరింతగా పెంచే మూడు వాట్సప్ ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
వాట్సప్ గత ఏడాది ఓ ప్రత్యేకమైన ఫీచర్ ప్రవేశపెట్టింది. కాల్ మధ్యలో ఉండగా ఎప్పుడైనా మీరు చేరాలంటే చేరవచ్చు. బిజీగా ఉండి కొంతమంది వాట్సప్ కాల్స్ లిఫ్ట్ చేయలేకపోతుంటారు. అటువంటివారి కోసమే ఈ ఫీచర్. వాట్సప్ గ్రూప్ కాల్ మిస్ అయితే కాల్ మధ్యలో మీరు యాడ్ అవచ్చు. ఈ కొత్త ఫీచర్ వీడియో, ఆడియో కాల్స్ రెండింటికీ వర్తిస్తుంది.
ఆండ్రాయిడ్ నుంచి ఐవోఎస్‌కు మారేటప్పుడు వాట్సప్ డేటా పోతుందనే భయముంటుంది. యూజర్లకు ఎదురయ్యే ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని వాట్సప్ కొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ సహాయంతో మీరు ఆండ్రాయిడ్ నుంచి ఐవోఎస్‌కు మారినా..సులభంగా చాట్ హిస్టరీ బ్యాకప్, అవసరమైన ఫైల్స్ బదిలీ చేసుకోవచ్చు.
వాట్సప్ ప్రవేశపెట్టిన మరో ఫీచర్ స్మాప్‌చాట్‌ను పోలి ఉంటుంది. ఈ ఫీచర్ ప్రకారం ఒకవేళ మీరు ఎవరికైనా ఏదైనా ఫోటో లేదా వీడియా పంపించినప్పుడు..అవతలి వ్యక్తి ఆ ఫోటో లేదా వీడియో ఒకసారి చూసిన వెంటనే డిలీట్ అయిపోతుంది. అంటే ఒకసారి చూసిన తరువాత రెండవసారి చూడలేం. ఈ ఫీచర్‌కు వ్యూ వన్స్ అని పేరు పెట్టింది వాట్సప్. అయితే ఈ ఫీచర్‌ను ఫోటో లేదా వీడియో పంపించేటప్పుడే సెలెక్ట్ చేయాలి. మీరు ఎవరికైతే పంపిస్తున్నారో ఆ వ్యక్తి ఒకసారి చూసిన తరువాత డిలీట్ అవ్వాలని మీరు అనుకుంటే..పంపించేముందు వ్యూ వన్స్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది.
Also read: Truecaller Call Recording: ట్రూ కాలర్ యాప్ లో కాల్ రికార్డింగ్ ఆపేయడానికి కారణమిదే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.