Shorts On Smart TVs: ఇక స్మార్ట్ టీవీల్లోనూ యూట్యూబ్ షార్ట్స్

Shorts On Smart TVs: 60 సెకన్లు, లేదా అంతకంటే తక్కువ నిడివి ఉండే ఈ షార్ట్స్ వీడియోలను ఇంట్లో రిలాక్స్ అవుతూ ఎంచక్కా స్మార్ట్ టీవీలో ఎంజాయ్ చేయవచ్చని తాజాగా కంపెనీ ప్రకటించింది. రానున్న రోజుల్లో స్మార్ట్ టీవీల్లో షార్ట్స్ వాచింగ్ ఎక్స్ పీరియెన్స్ మరింత అద్భుతం కానుందని కంపెనీ స్పష్టంచేసింది.

Written by - Pavan | Last Updated : Nov 8, 2022, 10:28 PM IST
  • షార్ట్స్ వీడియోలకు నిత్యం 30 బిలియన్ల వ్యూస్
  • అంతకంతకూ పెరుగుతున్న ఆధరణ
  • ఇకపై స్మార్ట్ టీవీల్లోనూ
Shorts On Smart TVs: ఇక స్మార్ట్ టీవీల్లోనూ యూట్యూబ్ షార్ట్స్

Watch Shorts On Smart TVs: యూట్యూబ్‌లో ఇటీవల కాలంలో షార్ట్స్ బాగా ఫేమస్ అయ్యాయి. వరల్డ్ వైడ్ నిత్యం కొన్ని బిలియన్ల మంది యూజర్స్ షార్ట్స్ చూస్తున్నారంటే షార్ట్స్ యాప్‌కి వచ్చిన క్రేజ్ ఏంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అందుకే షార్ట్స్‌లో మునిగితే సమయమే తెలియదు అంటుంటారు నెటిజెన్స్. అలా నిరంతరంగా షార్ట్స్ ఎంజాయ్ చేసే వారికి ఇప్పుడు ఇంకో గుడ్ న్యూస్. ఇప్పటివరకు స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్స్, డెస్క్ టాప్స్ కే పరిమితమైన షార్ట్స్ వీడియోలను ఇకపై మీ స్మార్ట్ టీవీలపై కూడా వీక్షించవచ్చు. అవును, కొత్తగా అప్ డేట్ అయిన యూట్యూబ్ స్మార్ట్ టీవీ యాప్ తో ఇకపై స్మార్ట్ టీవీలలోనూ షార్ట్స్ చూసేందుకు వీలు కలగనుంది.

60 సెకన్లు, లేదా అంతకంటే తక్కువ నిడివి ఉండే ఈ షార్ట్స్ వీడియోలను ఇంట్లో రిలాక్స్ అవుతూ ఎంచక్కా స్మార్ట్ టీవీలో ఎంజాయ్ చేయవచ్చని తాజాగా కంపెనీ ప్రకటించింది. రానున్న రోజుల్లో స్మార్ట్ టీవీల్లో షార్ట్స్ వాచింగ్ ఎక్స్ పీరియెన్స్ మరింత అద్భుతం కానుందని కంపెనీ స్పష్టంచేసింది. టీవీ రిమోట్ లో ఉన్న ప్లే, పాజ్ బటన్స్ ఉపయోగించి నేరుగా షార్ట్స్ వీక్షించే అవకాశం ఉంది. 

ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం ప్రతీ రోజు సుమారు 30 బిలియన్ల మంది నెటిజెన్స్ యూట్యూబ్ షార్ట్స్ వీక్షిస్తున్నారు. రాబోయే కాలంలో టీవీల్లోనూ షార్ట్స్ వీక్షించేందుకు వెసులుబాటు కలుగుతుండటంతో షార్ట్స్ వీక్షించే వారి సంఖ్య కూడా మరింతగా పెరగనుంది. యూట్యూబ్ షార్ట్స్ యాప్ తరహాలోనే టిక్ టాక్ కూడా స్మార్ట్ టీవీల్లో ప్రసారం చేసే అవకాశాలను పరిశీలిస్తోంది.

Trending News