Union Budget 2024: కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ జూన్ 23న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఓల్డ్ అండ్ న్యూ ట్యాక్స్ రెజీమ్ పరిధిలోని ట్యాక్స్ పేయర్లకు లబ్ది కలిగే నిర్ణయం ప్రకటించవచ్చనే అంచనాలున్నాయి.
ఎన్నికల ఏడాది కావడంతో ఈసారి పూర్తి స్థాయి బడ్జెట్ ఫిబ్రవరిలో ప్రవేశపెట్టలేదు. జూన్ 23వ తేదీన ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌పై ట్యాక్స్ పేయర్లు చాలా అంచనాలు పెట్టుకున్నారు. ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్, న్యూ ట్యాక్స్ రెజీమ్ విధానాల్లో ఉన్న ట్యాక్స్ పేయర్లకు ప్రయోజనం కల్గించే నిర్ణయం వెలువడవచ్చని భావిస్తున్నారు. తద్వారా మధ్య తరగతి ప్రజలకు రిలీఫ్ కల్పించవచ్చు. 2024-25 సంవత్సరపు పూర్తి స్థాయి బడ్జెట్ కావడంతో ట్యాక్స్ పేయర్లు చాలా ఆశలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టే ట్యాక్స్ పేయర్లకు ప్రయోజనం కల్గించే నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది.
న్యూ ట్యాక్స్ రెజీమ్ పరిధి పెరగనుందా
న్యూ ట్యాక్స్ రెజీమ్‌ను 2020 బడ్జెట్లో ప్రవేశపెట్టారు. ఏ విధమైన ట్యాక్స్ సేవింగ్స్ లేనివారికి ఈ విధానం ప్రయోజనం. గత బడ్జెట్లో న్యూ ట్యాక్స్ రెజీమ్ పరిమితి పెంచే కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఎందుకంటే న్యూ ట్యాక్స్ రెజీమ్ ప్రారంభమైనా ఎవరూ ఆసక్తి చూపించలేదు. ఈసారి కూడా కొన్ని మినహాయింపులు ఇవ్వచ్చని తెలుస్తోంది.
ఇన్సూరెన్స్‌పై డిడక్షన్
న్యూ ట్యాక్స్ రెజీమ్ ట్యాక్స్ పేయర్లకు హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ టెర్మ్ ఇన్సూరెన్స్‌పై డిడక్షన్ పొందవచ్చని తెలుస్తోంది. ఎందుకంటే ఈ రెండూ పెట్టుబడి పరిధిలో రావు. లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరికీ అవసరంగా మారింది. అందుకే న్యూ ట్యాక్స్ రెజీమ్ ట్యాక్స్ పేయర్లు ఈ మినహాయింపు పొందవచ్చని తెలుస్తోంది.
ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్‌లో ట్యాక్స్ రేటు తగ్గిచవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం 10 లక్షల ఆదాయం దాటితే 30 శాతం ట్యాక్స్ చెల్లించాల్సి వస్తుంది. అంటే నెలకు 90-95 వేలు జీతం తీసుకునే ఉద్యోగి ఏకంగా 27 వేలు ట్యాక్స్ చెల్లించాలంటే అంతకంటే దయనీయమైన పరిస్థితి మరొకటి ఉండదు. అందుకే ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్‌లో ట్యాక్స్ రేటు తగ్గించే ఆలోచన ఉంది.
ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్‌లో ఏడాదికి 2.5 లక్షల వరకూ ట్యాక్స్ లేదు. 2.5 లక్షల్నించి 5 లక్షల వరకూ ఆదాయంపై 5 శాతం ట్యాక్స్ ఉంటుంది. అదే 5-10 లక్షల ఆదాయంపై 20 శాతం ట్యాక్స్ చెల్లించాలి. ఇక 10 లక్షలు ఆదాయం దాటితే 30 శాతం ట్యాక్స్ ఉంటుంది.
న్యూ ట్యాక్స్ రెజీమ్‌లో 3 లక్షల వరకూ ఎలాంటి ట్యాక్స్ లేదు. 3-6 లక్షల వరకూ 5 శాతం, 6-9 లక్షల వరకూ 10 శాతం, 9 నుంచి 12 లక్షల వరకూ 15 శాతం, 12-15 లక్షల వరకూ 20 శాతం ట్యాక్స్ ఉంటుంది. ఇక 15 లక్షల ఆదాయం దాటితే మాత్రం 30 శాతం ట్యాక్స్ చెల్లించాలి.
Also read: Masked Aadhaar Card: మాస్క్డ్ ఆధార్ కార్డు అంటే ఏంటి, ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook