Budget 2023: నిర్మలా సీతారామన్ బడ్జెట్‌పై ట్యాక్స్ పేయర్లకు వరాలుంటాయా, బడ్జెట్ అంచనాలు

Budget 2023: ఆదాయానికి సంబంధించిన ప్రకటన కోసం బడ్జెట్‌లో ఆసక్తిగా నిరీక్షణ ఉంటుంది. ఎందుకంటే ప్రజలు, ప్రభుత్వ ఖజానా రెండింటిపై దీని ప్రభావం ఉంటుంది. ఈసారి బడ్జెట్‌లో ఇన్‌కంటాక్స్ పరిమితి పెంచవచ్చని ఆశిస్తున్నారంతా..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 29, 2023, 10:18 AM IST
Budget 2023: నిర్మలా సీతారామన్ బడ్జెట్‌పై ట్యాక్స్ పేయర్లకు వరాలుంటాయా, బడ్జెట్ అంచనాలు

ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ 2023-24 ప్రవేశపెట్టనున్నారు. 2024 ఎన్నికల ముందు వస్తున్న ఐదవ, చివరి సంపూర్ణ బడ్జెట్ ఇదే కావడంతో అంచనాలు ఎక్కువే ఉన్నాయి. ఈసారి బడ్జెట్ అంచనాలు, ప్రజల ఆశలతో పాటు నిర్మలా సీతారామన్ ఏం చేయనున్నారో తెలుసుకుందాం..

ట్యాక్స్ సంబంధిత ప్రకటన

ఇన్‌కంటాక్స్ సంబంధిత ప్రకటనపై బడ్జెట్‌పై చాలా ఆశలున్నాయి. ప్రభుత్వం ఈసారి ట్యాక్స్ పరిమితి పెంచి..వ్యక్తిగత ట్యాక్స్ పేయర్లకు ఉపశమనం కల్గించవచ్చు. కేంద్ర బడ్జెట్ 2023-24లో సెక్షన్ 80 సి ప్రకారం డిడక్షన్ పరిమితి ప్రస్తుతం 1.5 లక్షల రూపాయల్నించి పెంచాలనే డిమాండ్ ఉంది. అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం ఏప్రిల్ -నవంబర్ 2022 లో భారత దేశపు ఫిస్కల్ డెఫిసిట్ 9.78 లక్షల కోట్లు రూపాయలు లేదా మొత్తం ఆర్ధిక సంవత్సరం లక్ష్యంలో 58.9 శాతముంది. గత ఏడాది ఇదే కాలానికి ఫిస్కల్ ఢెపిసిట్ 2022 ఆర్ధిక సంవత్సరం లక్ష్యంలో 46.2 శాతముంది. ఫిస్కల్ డెఫిసిట్ ప్రభుత్వ వ్యయం, ఆదాయం మధ్య అంతరముంది.

ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం 2022-23లో బడ్జెట్ డిస్‌ఇన్వెస్ట్‌మెంట్ లక్ష్యం 65 వేల కోట్ల రూపాయలు. ఇందులోంచి ఇప్పటి వరకూ 31 వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ పరిశ్రమలలో తమ వాటా అమ్ముకుని సమీకరించింది. గత 4 ఏళ్లలో ప్రభుత్వం బడ్జెట్ లక్ష్యం నుంచి వరుసగా మినహాయింపు వస్తోంది. కేంద్ర బడ్జెట్ 2021-22లో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్.. తొలుత డిస్‌ఇన్వెస్ట్‌మెంట్ లక్ష్యం 1.75 లక్షల కోట్లు చేశారు. దీనిని తరువాత సవరించి 78 వేల కోట్లు చేశారు. అయితే 2021-22లో కేవలం 13,531 కోట్లే సాధించగలిగింది. ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలో ఇండియా  మెగా ఐపీవో ఎల్ఐసీ కన్పించింది. ఇప్పుడు రాష్ట్రాల నేతృత్వంలోని బ్యాంక్, ఒక సాధారణ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రైవేటీకరణ పెండింగులో ఉంది. 

గత బడ్జెట్ 2022లో కరోనా మహమ్మారి కారణంగా ప్రభావితమైన ఆర్ధిక వ్యవస్థకు బలోపేతం చేసేందుకు క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్‌ను పెంచారు. ఆర్ధిక సంవత్సరం 2023-24లో ప్రైవేట్ పెట్టుబడుల కోసం పెద్దఎత్తు ఖర్చు చేయవచ్చని తెలుస్తోంది. ప్రభుత్వం రానున్న 2023-24 బడ్జెట్‌లో క్యాపిటల్ సంపదపై రాష్ట్రాల ఖర్చుపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు క్యాపిటల్ వ్యయాన్ని పెంచేందుకు ప్రణాళక సిద్ధం చేస్తోంది. 

Also read: Tax payers: ప్రపంచంలో మూడవ కుబేరుడే, కానీ ట్యాక్స్ పేయర్లలో టాప్ 15 లో కూడా లేని అదానీ

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News