పార్లమెంట్‌లో కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ 2024 ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని కొనసాగినట్టు తెలుస్తోంది. వేతన జీవులకు ఇన్‌కంటాక్స్ మినహాయింపులు, వ్యవసాయం రంగంలో 20 లక్షల కోట్ల రుణాలతో మధ్య తరగతి ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేసిందని తెలుస్తోంది.
అదే సమయయంలో ఎయిర్ కనెక్టివిటీపై కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది. దేశంలో ఎయిర్ కనెక్టివిటీని మెరుగుపర్చేందుకు 50 కొత్త విమానాశ్రయాలు, వాటర్ ఎయిర్ ద్రోన్, హెలీప్యాడ్‌ల నిర్మాణం చేపట్టనుంది. క్షేత్రస్థాయిలో ఎయిర్ కనెక్టివిటీలో వృద్ధి కోసం 50 విమానాశ్రయాలు, హెలీప్యాడ్, వాటర్ ఏరో ద్రోన్‌లను అభివృద్ది చేయనున్నామని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఉదయం 11 గంటలకు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ 2024 ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన చివరి సంపూర్ణ బడ్జెట్. 2024లో ఎన్నికలుండటంతో ఈ బడ్జెట్ ప్రాధాన్యత సంతరించుకుంది.
పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్ధిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధురి, ఆర్ధిక శాఖ సెక్రటరీ టీవీ సోమనాథన్ రాష్ట్రపతి ద్రౌపతి ముర్మును కలిసి బడ్జెట్‌పై ఆమోదం తీసుకున్నారు. అనంతరం అంటే 10 గంటల 15 నిమిషాలకు ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ ఆమోదించింది. అంతకుముందు రోజు అంటే జనవరి 31న రాష్ట్రపతి ప్రసంగం సాగింది. ఆ తరువాత 2022-23 ఆర్ధిక సర్వే ప్రవేశపెట్టారు. 2023-24 ఆర్ధిక సంవత్సరపు బడ్జెట్ రూపకల్పన అక్టోబర్ 10 నుంచి ప్రారంభమైంది. ఆర్ఖిక సర్వేలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇండియా జీడీపీ 6 నుంచి 6. శాతం పెరగవచ్చని అంచనా ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook