UIDAI Updates: మీ ఆధార్ కార్డు మరింత సురక్షితం, ఇకపై కొత్త సెక్యూరిటీ మెకానిజంతో వెరిఫికేషన్

UIDAI Updates: దేశమంతటా చాలాచోట్ల ఆధార్ కార్డు దుర్వినియోగం పెరుగుతోంది. అందుకే యూఐడీఏఐ కూడా ఎక్కడపడితే అక్కడ ఆధార్ కార్డు కాపీలు ఇవ్వద్దని సూచిస్తోంది. ఈసారి యూఐడీఏఐ మీ ఆధార్ కార్డును మరింత సురక్షితం చేసే పద్ధతులు ప్రవేశపెట్టింది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 28, 2023, 01:04 PM IST
UIDAI Updates: మీ ఆధార్ కార్డు మరింత సురక్షితం, ఇకపై కొత్త సెక్యూరిటీ మెకానిజంతో వెరిఫికేషన్

ఆధార్ కార్డు దుర్వినియోగం, ఆధార్ కార్డు సంబంధిత మోసాల గురించి తరచూ వింటూనే ఉంటారు. ఇప్పుడిక ఆ మోసాలకు చెక్ పడనుంది. యూఐడీఏఐ ఇప్పుడు మీ ఆధార్ కార్డును మరింత సురక్షితం చేసే కొత్త సెక్యూరిటీ మెకానిజం ప్రవేశపెట్టింది. ఆ వివరాలు మీ కోసం..

ఆధార్ కార్డు జారీ చేసే యూఐడీఏఐ కొత్తగా ఫింగర్‌ప్రింట్ ఆధారిత ఆధార్ కార్డు నిర్దారణ ప్రవేశపెట్టింది. ఆధార్ వెరిఫికేషన్‌ను మరింత సురక్షితం చేసేందుకు కొత్త పద్దతి ప్రారంభించింది. ఒకవేళ ఎవరైనా మీ ఆధార్ కార్డును ఎక్కడైనా దుర్వినియోగం చేస్తుంటే వెంటనే మీకు తెలిసిపోతుంది. 

పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చిన ఈ మెకానిజమ్ ఆధారిత పేమెంట్ సిస్టమ్‌ను పటిష్టం చేస్తుంది. దాంతోపాటు ఆధార్ కార్డును దుర్వినియోగం చేసే ప్రయత్నాలకు చెక్ పడుతుంది. బ్యాంకింగ్, ఆర్ధిక, మొబైల్ ఫోన్, ప్రభుత్వ రంగాల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ ఆధారిత సెక్యూరిటీ సిస్టమ్ నమోదైన ఫింగర్‌ప్రింట్ వెరిఫికేషన్ కోసం వేలి వివరాలు లేదా వేలి ముద్ర ఫోటోను ఉపయోగించవచ్చు.

స్ట్రాంగ్ ఫింగర్ ప్రింట్ ఆధారిత ఆధార్ వెరిఫికేషన్ కోసం కొత్త సెక్యూరిటీ సిస్టమ్‌ను యూఐడీఏఐ ప్రకటించింది. దీంతో ఆధార్ వెరిఫికేషన్ పటిష్టంగా, సురక్షితంగా ఉంటుంది. రెండు దశల్లోని కొత్త వెరిఫికేషన్ సిస్టమ్ కచ్చితత్వాన్ని నిరూపించేందుకు పరిశోధన జరుగుతోంది. మరోవైపు మోసం జరిగే అవకాశాలు తగ్గనున్నాయి.

Also read: Income tax Alert: వెంటనే చేయకపోతే పాన్‌కార్డు హోల్డర్లకు 10 వేల భారీ జరిమానా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News