DA Hike Latest Update: ప్రభుత్వ ఉద్యోగులకు ఎగిరి గంతేసే న్యూస్‌.. DA ఏకంగా 4 శాతం పెంపు!..


7Th Pay Commission DA Hikes Update: కేంద్రం త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌ తెలపబోతోంది..  డీఏలో పెంపుపై ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ పెంపు వల్ల లక్షలాది కేంద్ర ఉద్యోగులకు భారీ జీతాలు పెరిగి ఖర్చుల భారం తగ్గుతుంది. అలాగే పెన్షనర్లకు ఊరట లభించనుంది. ఈరోజు జరగబోతున్న కేంద్ర కేబినెట్‌ సమావేశంలో  ధరల పెంపుపై చర్చించే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. 

1 /8

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గొప్ప వార్త రాబోతుంది. జులై 2024 నుంచి డీఏ పెంపును ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. ఈ పెంపు వల్ల లక్షలాది మంది ఉద్యోగులకు నెలవారీ ఆదాయం గణనీయంగా పెరుగుతుందని సమాచారం. ఈనెల బుధవారం 25 జరిగే కేంద్ర కేబినెట్‌ సమావేశంలో డీఏ పంపుపైన అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.   

2 /8

మన దేశంలోని ఎక్కువగా మంది గవర్నమెంట్‌, సెంట్రల్‌ గవర్నమెంట్‌ జాబ్స్‌లో పనిచేయడానికి మక్కువ చూపుతారు. ప్రతి సంవత్సరం ప్రభుత్వ రంగాల్లో లక్షల మంచి జాబ్స్‌ పొందుతారు. ఇందులో ఉండే అలవెన్సులు, స్టైపెండ్ వంటి ప్రయోజనాలు ఉంటాయి. కాబట్టి చాలా మంది ఈ జాబ్స్‌ కోసం ఎంతో ప్రయత్నిస్తుంటారు. అయితే ఈ ఉద్యోగాల్లో డీఏకు ఎక్కువ ప్రముఖ్యత ఉంటుంది.   

3 /8

డీయర్‌నెస్‌ అలవెన్స్‌ (DA) అనేది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వారి జీతాలకు అదనంగా ఇచ్చేది. ఇది ప్రతి ఆరు నెలలకు ఒకసారి All India Consumer Price Index - AICPI ఆధారంగా ప్రభుత్వం సవరిస్తుంది. గతంలో కేంద్ర ఉద్యోగులకు డియర్‌నెస్‌ అలవెన్స్‌ పెంచిన సంగతి తెలిసిందే..

4 /8

సబ్సిడీ పెంపును కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీని వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షర్లకు భారీగా లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా నెలవారీ ఆదాయం భారీగా పెరుగుతుందని తెలుస్తోంది. ఈరోజు జరగబోయే కేంద్ర కేబినెట్ సమావేశంలో ప్రజల జీవన వ్యయంపై ప్రకటన వెలువడే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.  

5 /8

జనవరిలో DA పెరుగుదలను నిర్ణయించడానికి మునుపటి సంవత్సరం జూలై నుంచి డిసెంబర్ వరకు ఉన్న AICPI-IW ఇండెక్స్ సంఖ్యలపై ఉంటుంది. అలాగే జూన్‌ నెలలో తగ్గింపు జనవరి నుంచి జూన్‌ వరకు ఉన్న ఇండెక్స్‌ సంఖ్యలపై ఆధారపడి ఉంటుంది. ఈ సగటు విలువ ఆధారంగా DA పెరుగుదల శాతాన్ని నిర్ణయిస్తారు.

6 /8

ఈ సంవత్సరంలో జనవరి నుంచి జూన్ వరకు AICPI ఇండెక్స్ సంఖ్యలలో భారీ పెరుగుదల ఉంది. దీని ఆధారణంగా ౩ శాతం నుంచి 4 శాతం వరకు పెరుగుతుందని నిపుణుల అంచనా.  

7 /8

2024 జనవరిలో ఉద్యోగులకు డీయర్‌నెస్‌ అలవెన్స్‌ను నాలుగు శాంత పెంచిన సంగతి తెలిసిందే.. ఆ తర్వాత 2024లో మార్చిలో  50 శాతం పెరిగింది.

8 /8

ఎనిమిదో వేతన సంఘంపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కళ్లలో వత్తులు వేసుకొని ఎదురుచూస్తున్నారు. దీని వల్ల ప్రాథమిక వేతనాల్లో భారీ పెరుగుదల ఉంటుంది. అంతేకాకుండా కేంద్ర ఉద్యోగుల జీతంలో మంచి పెరుగుదలు కూడా ఉంటుంది.