Hyderabad Rains: గత మూడు నాలుగు రోజులుగా పశ్చిమ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం తూర్పు, పశ్చిమ ద్రోణితో కలిసి అల్ప పీడనం మారింది. దీంతో హైదరాబాద్ లో డేంజర్ లో ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Hyderabad Rains: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తనం తూర్పు- పశ్చిమ ద్రోణితో కలిసి అల్పపీడనంగా మారింది. సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది.
అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాదు మరో రెండు రోజుల వరకు తేలికపాటి వర్షం నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని ఏడు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్ ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి జిల్లాల్లో కొన్ని చోట్ల వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. కాగా నిన్న అత్యధికంగా జనగామ జిల్లా దేవరుప్పులలో 11.5 సెం.మీ. వర్షం కురిసింది. ఉమ్మడి వరంగల్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం కరీంనగర్, జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయని ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
భారీ వర్షాల నేపథ్యంలో న హైదరాబాద్, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసి ప్రజలను అప్రమత్తం చేశారు.
హైదరాబాద్ జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్‌లకు వరద పోటెత్తింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు భారీగా వరద వచ్చి చేరుంతోంది. కాగా హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 1 వేయి 763 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 1 వేయి 762 అడుగులకు చేరింది.
ఉస్మాన్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1 వేయి 790 అడుగులు కాగా..ప్రస్తుత నీటిమట్టం 1 వేయి 780 అడుగులుగా ఉంది. ఇప్పటికే ఉస్మాన్ సాగర్ 2 గేట్లను 1ఫీట్ మేరకు ఎత్తారు అధికారులు. ఇవాళ హిమాయత్ సాగర్ గేట్లను ఎత్తే అవకాశం ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాలు, మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు.