Eligibilities of Aadhaar Card: ఆధార్ కార్డుకు కావల్సిన అర్హతలేంటి..? ఎవరెవరికి ఆధార్ కార్డు జారీ చేస్తారు..?

Aadhaar Card New Updates: ఆధార్ కార్డు దేశంలో ఇది ఇప్పుడు తప్పనిసరి. ఏ పనికైనా సరే ఆధార్ కార్డు ఆధారమైపోయింది. అందుకే యూఐడీఏఐ ఎప్పటికప్పుడు ఆధార్ కార్డు విషయంలో అప్‌డేట్ ఇస్తుంటుంది. ఆ వివరాలు తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 8, 2023, 10:26 AM IST
  • ఆధార్ కార్జు విషయంలో యూఐడీఏఐ కీలక సూచనలు
  • ఆధార్ కార్డు కావాలంటే కావల్సిన ప్రధాన అర్హతలేంటి
  • ఎవరెవరికి ఆధార్ కార్డు ఇవ్వాల్సి ఉంటుంది
Eligibilities of Aadhaar Card: ఆధార్ కార్డుకు కావల్సిన అర్హతలేంటి..? ఎవరెవరికి ఆధార్ కార్డు జారీ చేస్తారు..?

Aadhaar Card New Updates: ఆధార్ కార్డు చేయించుకోవాలంటే ఇక ఈ అర్హత తప్పనిసరి అని యూఐడీఏఐ సూచిస్తోంది. ఆ అర్హత లేకుంటే ఆధార్ కార్డు చేయించుకోవడం అసాధ్యం. ఆధార్ అనేది దేశ నాగరికులకు ఇచ్చే 12 అంకెల ఓ విశిష్టమైన కోడ్. ఆ వ్యక్తి బయోమెట్రిక్ వివరాలను బట్టి ఉంటుంది. 

ఇండియాలో ఆధార్ కార్డు అనేది కీలకమైన దస్తావేజుల్లో ఒకటిగా మారిపోయింది. ఆధార్ కార్డు సహాయంతోనే గుర్తింపు నిర్ధారణ జరుగుతోంది. అందుకే ఆధార్ లేకుండా కేవైసీ జరగని పరిస్థితి. ఆధార్ కార్డు భారత పౌరులకు ఇచ్చే ఓ విశిష్ట గుర్తింపు సంఖ్య. పాన్ కార్డు ఎంత అవసరమో ఆధార్ కార్డు కూడా అంతే అవసరం. ఆధార్ కార్డు ప్రస్తుతం దేశంలోని ప్రతి ప్రభుత్వం, ప్రైవేటు పనులకు ఉపయోగపడుతోంది. ఆధార్ కార్డు చేయించుకోవాలంటే కొన్ని అర్హతలు ఉండాలంటోంది యూఐడీఏఐ.

ఆదార్ కార్డు అనేది 12 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్యను కలిగి ఉండే కార్డు. ప్రతి వ్యక్తికి ఆ వ్యక్తి పుట్టిన తేదీ, బయోమెట్రిక్ వివరాల ఆధారంగా జనరేట్ అవుతుంది. ఆధార్ కార్డును దేశంలో యూఐడీఏఐ జారీ చేస్తుంటుంది. 2016లో యూఐడీఏఐను స్థాపించారు.

Also Read: Tata New Car Launch 2023: మార్కెట్‌లో సంచలనం సృష్టించనున్న టాటా.. త్వరలోనే 4 ఎస్‌యూవీలు రిలీజ్!

ఆధార్ కార్డుకు కావల్సిన అర్హత

ఆధార్ కార్డును ఐడెంటిటీ రూపంలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఆధార్ కార్డు చేయించుకోవాలంటే..కొన్ని స్టెప్స్ ఫాలో కావల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆధార్ కార్డు కోసం కొన్ని అర్హతలు కూడా పొందాల్సి ఉంటుంది. ఇండియాలో ఆధార్ కార్డు చేయించుకోవాలంటే కొన్ని అర్హతలు ఉండాలి. నిబంధనల ప్రకారం ప్రతి భారతీయ పౌరుడు ఆధార్ కార్డు పొందేందుకు అర్హుడు. బాల ఆధార్ కార్డు ఐదేళ్ల కంటే తక్కువ వయస్సు పిల్లలకు ఇస్తారు. 12 నెలల కంటే ఎక్కువ సమయం నుంచి ఇండియాలో ఉండే ఎన్ఆర్ఐలు, విదేశీ ఆధార్ కార్డుకు అర్హులౌతారు. ఇండియన్ పాస్‌పోర్ట్ కలిగిన ఎన్ఆర్ఐలు 180 రోజులు నిరీక్షించకుండా ఇండియాకు వచ్చిన తరువాత ఆధార్ కార్డును జారీ చేయాల్సి ఉంటుంది. 

Also Read: Ration Card New Rules: ఇవాళ్టి నుంచి మారుతున్న రేషన్ కార్డు నిబంధనలేంటి,రేషన్ ఎంత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook

Trending News