Aadhaar Card: ఆధార్ కార్డు విషయంలో కీలక సూచనలు జారీ చేసిన యూఐడీఏఐ

Aadhaar Card: దేశంలో ఇప్పుడు ప్రతి పనికీ ఆధారమైంది ఆధార్ కార్డు. అందుకే ఆధార్ కార్డు జారీ చేసే యూఐడీఏఐ..ఆధార్ కార్డు విషయంలో కీలక సూచనలు జారీ చేసింది. ఆ వివరాలు మీ కోసం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 31, 2022, 05:33 PM IST
Aadhaar Card: ఆధార్ కార్డు విషయంలో కీలక సూచనలు జారీ చేసిన యూఐడీఏఐ

దేశంలో పౌరులకు విశిష్ట గుర్తింపు కార్డు ఆధార్. ప్రతి పనికీ ఇప్పుడు కీలకంగా మారిన నేపధ్యంలో ఆధార్ కార్డు  వినియోగంపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. బ్యాంకు ఎక్కౌంట్, పాన్‌కార్డు, పాస్‌పోర్ట్‌లానే ఆధార్ గుర్తింపు కార్డు వినియోగంపై జాగ్రత్తగా ఉండాలంటోంది. 

దేశంలో ప్రతి పనికీ ఆధార్ కార్డు తప్పనిసరిగా మారినందున ఆధార్ కార్డు వినియోగంపై జాగ్రత్త అవసరమంటోంది యూఐడీఏఐ. ప్రజలు తమ ఆధార్ కార్డుని ఎక్కడ పడితే అక్కడ వదిలేయవద్దని హెచ్చరిస్తోంది. సోషల్ మీడియా సహా ఇతర వేదికలపై తమ ఆధార్ నెంబర్ షేర్ చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. ఆధార్ నెంబర్ వినియోగించేటప్పుడు మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ వివరాలు ఎవరికీ ఇవ్వకూడదు. అదే విధంగా ఎంఆధార్ విషయంలో పిన్ నెంబర్ కూడా ఎవరికీ షేర్ చేయకూడదు. 

ఆధార్ లాక్ చేసే వెసులుబాటు

యూఐడీఏఐ జారీ చేసిన సూచనల ప్రకారం సంక్షేమ పధకాలు, ఇతర సేవల కోసం ఆధార్ కార్డు వినియోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ బ్యాంకు ఎక్కౌంట్, పాన్‌కార్డు లేదా పాస్‌పోర్ట్ వంటి ఇతర గుర్తింపు పత్రాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో ఆధార్ కార్డు విషయంలో కూడా అలానే జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది. ఆధార్ కార్డు దుర్వినియోగం కాకుండా వర్చువల్ ఐడెంటిఫైయర్ సౌకర్యం కూడా ఉంది. ఆధార్ నెంబర్ ఎవరికీ షేర్ చేయకూడదు. అదే సమయంలో ఆధార్ నెంబర్‌ను లాక్ చేయకూడదు. 

Also read: January 2023 Bank Holidays: కొత్త ఏడాది జనవరిలో బ్యాంకు సెలవుల జాబితా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News