Aadhaar Updates: ఆధార్ కార్డుపై కీలక అప్‌డేట్, ఆదేశాలు పాటించకపోతే ఇబ్బందులు తప్పవు

Aadhaar Updates: ఆధార్ కార్డు వినియోగదారులకు కీలకమైన అప్‌డేట్ ఇది. ఆధార్ కార్డు విషయమై ప్రభుత్వం కొత్త ఆదేశాలు జారీ చేసింది. ఇవి పాటించకపోతే తీవ్రమైన నష్టం ఎదుర్కోవల్సి వస్తుంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 25, 2023, 04:18 PM IST
Aadhaar Updates: ఆధార్ కార్డుపై కీలక అప్‌డేట్, ఆదేశాలు పాటించకపోతే ఇబ్బందులు తప్పవు

ఆధార్ కార్డు హోల్డర్లకు అతి ముఖ్యమైన సమాచారమిది. కేంద్ర ప్రభుత్వం తరపున యూఐడీఏఐ జారీ చేసిన కొత్త ఆదేశాల్ని పాటించకపోతే ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే ప్రస్తుతం అన్నింటికీ ఆధార్ కార్డు అత్యవసరం, ఆధారం కూడా. ఆధార్ నెంబర్ లేకుండా కనీసం బ్యాంక్ ఎక్కౌంట్ కూడా ఓపెన్ కాదు. ఆధార్ అప్‌డేట్ నిమిత్తం ఎవరైనా డబ్బులు అడిగితే..దీనికోసం ఓ నెంబర్ విడుదల చేసింది యూఐడీఏఐ.

యూఐడీఏఐ ట్వీట్ ద్వారా ఇచ్చిన సమాచారం మేరకు ఒకవేళ ఏదైనా ఏజెన్సీ లేదా ఎవరైనా వ్యక్తి ఆధార్ అప్‌డేట్ నిమిత్తం డబ్బులు అడిగితే మీరు దానికి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవచ్చు. ఫిర్యాదు కోసం 1947 నెంబర్ డయల్ చేస్తే సరిపోతుంది. 

ఆధార్ కార్డుతో పాన్‌కార్డు లింక్ తప్పనిసరి

ఆధార్ ఇటీవలి కాలంలో ఓ అవసరమైన అతి ముఖ్యమైన డాక్యుమెంట్. మీకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు, బ్యాంక్ ఎక్కౌంట్లలో ఆధార్ లింక్ చేయాల్సి ఉంటుంది. ఫలితంగా ఎప్పుడు ఏ సమస్యా ఉత్పన్నం కాదు. అటు ఇన్‌కంటాక్స్ విభాగం కూడా  1961 ఆదాయపు పన్ను చట్టం ప్రకారం పాన్‌కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానించాల్సి ఉంది. దీనికోసం గడువు తేదీని మార్చ్ 31 వరకూ పొడిగించింది. పాన్‌కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానించకపోతే ఆ పాన్‌కార్డు నిరుపయోగమౌతుంది.

గడువు తేదీ మరోసారి పొడిగించే అవకాశం శూన్యం

పాన్‌కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసేందుకు గడువు తేదీ ఇప్పటికే చాలాసార్లు ప్రభుత్వం పొడిగించింది. ఈసారి ప్రభుత్వం మరింతగా పొడిగించేందుకు సిద్ధంగా లేదని తెలుస్తోంది. అందుకే మీరు త్వరగా మీ పాన్‌కార్డును మీ ఆధార్ కార్డుతో లింక్ చేసేయండి. సీబీడీటీ తరపున ఈ విషయమై చాలాసార్లు అలర్ట్ జారీ అయింది.

గడువు తేదీ దాటితే పెనాల్టీతో కూడా సాధ్యం కాదు

సీబీడీటీ వెల్లడించిన సమాచారం ప్రకారం ఆధార్ కార్డుతో పాన్‌కార్డు లింక్ చేయకపోతే వేయి రూపాయలు జరిమానా ఉంటుంది. ఆ తరువాత జరిమానాతో కూడా పాన్‌కార్డు-ఆధార్ కార్డు అనుసంధానం కుదరదని సీబీడీటీ తెలిపింది. మరోసారి గడువు తేదీ పొడిగించే ప్రసక్తి ఉండదు. 

Also read: Health Tips: కిచెన్‌లో ఉండే ఈ స్లో పాయిజన్ పదార్ధాలు వెంటనే దూరం చేయండి లేకపోతే ప్రాణాలు తీస్తాయి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News