Twitter Poll: లేపి తన్నించుకోవడమంటే ఇదే, ఎలాన్‌మస్క్‌కు షాక్ ఇచ్చిన యూజర్లు

Twitter Poll: టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్‌మస్క్ చేతిలో వెళ్లాక ట్విట్టర్‌లో అనేక మార్పులు జరుగుతున్నాయి. సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న ఎలాన్‌మస్క్‌కు ఇప్పుడు యూజర్లు సంచలనమైన షాక్ ఇచ్చారు. ఆ వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 19, 2022, 07:30 PM IST
Twitter Poll: లేపి తన్నించుకోవడమంటే ఇదే, ఎలాన్‌మస్క్‌కు షాక్ ఇచ్చిన యూజర్లు

ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సోషల్ మీడియా వేదిక ట్విట్టర్‌లో ఇటీవల చాలా మార్పులు జరుగుతున్నాయి. భారీ డీల్‌తో ట్విట్టర్‌ను చేజిక్కించుకున్న ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. బహుశా అందుకే యూజర్లకు అతనికే షాక్ ఇచ్చేశారు.

ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న తరువాత ఆ సంస్థకు సీఈవోగా వ్యవహరిస్తున్న ఎలాన్‌మస్క్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నాడు. భారత్ సహా వివిధ దేశాల్లో ట్విట్టర్ హెడ్స్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా సంస్థలో పనిచేస్తున్న సగం మందిని ఇంటికి పంపించేశాడు. ఆ తరువాత ట్విట్టర్ వెరిఫైడ్ ఖాతాలకు నెలనెలా డబ్బులు చెల్లించాలనే విధానం ప్రవేశపెట్టాడు. ఉద్యోగాల తొలగింపుపై ఇప్పటికే ఎలాన్‌మస్క్‌పై భారీగా విమర్శలు వచ్చాయి.

ఈ మధ్య వివిధ అంశాలపై యూజర్ల అభిప్రాయాల కోసం ట్విట్టర్‌లో పోల్ నిర్వహిస్తున్నాడు. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను తిరిగి ట్విట్టర్‌లో తీసుకోవాలా వద్దా అనే విషయంపై పోల్ నిర్వహించినప్పుడు మెజార్టీ యూజర్లు తీసుకోవాలని ఓటింగ్ చేశారు. ఆ తరువాత రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై నిర్వహించిన పోల్ వివాదాస్పదమైంది. 

ఇప్పుడు తాజాగా ట్విట్టర్ సీఈవోగా తాను కొనసాగాలా వద్దా అని తనకు తాను పోల్ నిర్వహించుకున్నాడు. ఈ పోల్‌పై యూజర్లు ఎలాన్‌మస్క్‌కు షాక్ ఇచ్చారు. మొత్తం 17 మిలియన్ల మంది యూజర్లలో 57.5 శాతం మంది వైదొలగాలని ఓటేశారు. 

Also read: Share Market: పుంజుకున్న మార్కెట్, గ్రీన్ కలర్‌తో క్లోజ్ అయిన సెన్సెక్స్, నిఫ్టీలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News