Banks Interest Rates: సీనియర్ సిటిజన్ల ఎఫ్‌డీలపై 9 శాతంపైగా వడ్డీ చెల్లిస్తున్న బ్యాంకులివే

Banks Interest Rates: దేశంలో ఒక్కొక్క బ్యాంక్ వడ్డీ రేట్లు ఒక్కోలా ఉంటాయి. ఫిక్స్డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు వడ్డీ అందరికంటే ఎక్కువ ఉంటుంది. ఆ వివరాలు తెలుసుకుందాం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 13, 2023, 11:09 AM IST
Banks Interest Rates: సీనియర్ సిటిజన్ల ఎఫ్‌డీలపై 9 శాతంపైగా వడ్డీ చెల్లిస్తున్న బ్యాంకులివే

Banks Interest Rates: దేశంలో చాలామంది సీనియర్ సిటిజన్లకు వృద్ధాప్యంలో వచ్చే ఆదాయం బ్యాంకుల్నించి వచ్చే వడ్డీనే. జీవితకాలంలో కష్టపడి సంపాదించింది కూడబెట్టి బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో భద్రపర్చుకుని వాటిపై వచ్చే వడ్డీతో బతుకుతుంటారు. అందుకే ఏ బ్యాంకులో ఎక్కువ వడ్డీ లభిస్తుందనే ఆసక్తి ఉంటుంది. 

దేశంలో ప్రముఖ బ్యాంకులైన ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డిఎఫ్‌సి వంటి బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు ఇతరుల కంటే 50 బేసిస్ పాయింట్లు ఎక్కువే వడ్డీ చెల్లిస్తుంటాయి. ఫిక్స్డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు ఏ బ్యాంకు ఎంత వడ్డీ చెల్లిస్తుందనేది తెలుసుకుందాం.

యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను 6 నెలల్నించి 201 రోజుల వరకూ 9.25 శాతం,  1001 రోజులకైతే 9.50 శాతం వడ్డీని ఆగస్టు 11 నుంచి చెల్లిస్తోంది. 

నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 555 రోజులు, 1111 రోజుల ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీలపై 9.25 శాతం వడ్డీ చెల్లిస్తోంది. 

సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వడ్డీ రేట్లు 9 శాతం నుంచి ప్రారంభమౌతున్నాయి. 15 నెలల నుంచి 2 ఏళ్ల వరకూ ఉంటుంది. 2-3 ఏళ్ల ఎఫ్‌డిలకు 9.10 శాతం వడ్డీని ఆగస్టు 7 నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. 

ఈక్విటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు 444 రోజులకైతే 9 శాతం వడ్డీ ఇస్తోంది. ఈ వడ్డీని ఆగస్టు 21 నుంచి ప్రారంభించింది. 

ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 2-3 ఏళ్ల ఎఫ్‌డిలపై 9 శాతం వడ్డీ ఇస్తోంది. ఏప్రిల్ 14 నుంచి ఈ వడ్డీ అందుబాటులో ఉంది. 

ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎఫ్‌డీ వడ్డీ రేట్లను 9 నుంచి 9.43 శాతానికి పెంచింది. అయితే కాల పరిమితి 500, 750, 1000 రోజులుండాలి. 

జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వడ్డీ రేట్లు 1095 రోజులకైతే 9 శాతం ఉంది. ఆగస్టు 15 నుంచే ఈ వడ్డీ అందుబాటులో ఉంది. 

ఇక ఎస్బీఐ, ఐసీఐసీఐ,హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకులైతే మిగిలిన అన్ని బ్యాంకులకంటే ఎక్కువే సీనియర్ సిటిజన్లకు వడ్డీ చెల్లిస్తున్నాయి. 

Also read: Tata SUV Cars: సేల్స్‌లో పోటీ పడుతున్న ఒకే కంపెనీ ఎస్‌యూవీ కార్లు, ధర ఎంతంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News