Gold Rate Today In India: మార్కెట్లో నేటి బంగారం, వెండి ధరలు

Gold Rate Today In India On 13th November 2020 |  బులియన్ మార్కెట్‌లో వరుసగా పెరుగుతున్న బంగారం ధరలు (Gold Rate Today) తాజాగా తగ్గుతున్నాయి. పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలు బంగారం ధరలు, వెండి ధరలపై ప్రభావం చూపుతాయని తెలిసిందే.

Last Updated : Nov 13, 2020, 06:32 AM IST
Gold Rate Today In India: మార్కెట్లో నేటి బంగారం, వెండి ధరలు

గత వారం రోజులుగా బులియన్ మార్కెట్‌లో వరుసగా పెరుగుతున్న బంగారం ధరలు (Gold Rate Today) తాజాగా తగ్గుతున్నాయి. అయితే నేటి మార్కెట్‌లో బంగారం ధరలు యథాతథంగా కొనసాగుతున్నాయి. పసిడికి భిన్నంగా వెండి ధరలు స్వల్పంగా దిగొచ్చాయి. విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్‌‌లలో బంగారం ధర (Gold Rate Today In Hyderabad) నిన్న రూ.110 మేర స్వల్పంగా పెరిగింది. నేడు సైతం 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.51,500గా కొనసాగుతోంది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,200 వద్ద స్థిరంగా ఉంది.

 

ఢిల్లీ మార్కెట్‌లోనూ గత వారం పెరిగిన బంగారం ధరలు (Gold Price in Delhi) తాజాగా ఎలాంటి మార్పులేదు. నేటి మార్కెట్‌లో బంగారం ధరలు ఢిల్లీలో యథాతథంగా ఉన్నాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.53,610 అయింది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,160తో నిన్నటి ధరలో కొనసాగుతోంది.

 

బులియన్ మార్కెట్‌లో గత వారం భారీగా పెరిగిన వెండి ధరలు (Silver Rate in India) ఈవారం తగ్గుతున్నాయి. తాజాగా వెండి ధర రూ.100 మేర స్వల్పంగా దిగొచ్చింది. దీంతో బులియన్ మార్కెట్‌లో ప్రస్తుతం 1 కేజీ వెండి ధర రూ.62,700కి పతనమైంది. దేశ వ్యాప్తంగా కేజీ వెండి ఇదే ధరలో ట్రేడ్ అవుతోంది.

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News