Tech Industry ఆఫీసులకు రామంటున్న ఐటీ ఉద్యోగులు

Edited by - ZH Telugu Desk | Last Updated : May 14, 2022, 03:29 PM IST
  • ఆఫీసులకు వచ్చేందుకు ఇష్టపడని ఐటీ నిపుణులు
  • రాజీనామాలు చేసేందుకు సిద్ధపడుతున్న ఐటీ నిపుణులు
  • రాజీనామాకు సిద్ధపడ్డుతున్న 39 శాతం సిబ్బంది
Tech Industry ఆఫీసులకు రామంటున్న ఐటీ ఉద్యోగులు

Tech Industry వర్క్ ఫ్రం హో నుంచి అంతా ఇప్పుడిప్పుడు ఆఫీసుల బాట పడుతున్నారు. ఈపాటికే చాలా రంగాల్లో కార్యకలాపాలు ఆఫీసుల నుంచే కొనసాగుతున్నా . ..ఐటీ రంగంలో మాత్రం ఇంకా వర్క్ ఫ్రం హోం కొనసాగుతోంది. పని అంతా కంప్యూటర్‌లోనే ముడి పడి ఉండడంతో ఈ రంగానికి ఉన్న సౌలభ్యం కారణంగా వర్క్ ఫ్రం హోం కొనసాగుతోంది. అయితే సుదీర్ఘ కాలంగా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కల్చర్‌కు అలవాటు పడ్డి ఐటీ రంగంలోని నిపుణులు ఇప్పుడు మళ్లీ ఆఫీసులకు వచ్చేందుకు ఇష్టపడడం లేదు. ఇంటి నుంచే పని చేస్తే వచ్చే నష్టం ఏంటని తిరిగి యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు. ఉత్పత్తి తగ్గనప్పుడు ఎక్కడి నుంచి పని చేస్తే ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయినా కాదు కూడదు అని యాజమాన్యం బలవంతం చేస్తే  
ఉద్యోగానికి రాజీమానా చేస్తామంటూ యాజమాన్యంపై ఒత్తిడి పెంచుతున్నారు.

దీంతో ఐటీ సంస్థలు ఉద్యోగుల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు సర్వేలు నిర్వహిస్తున్నాయి. బ్లూమ్‌బెర్గ్ ప్రకారం..39శాతం మంది ఉద్యోగులు రాజానామాకి సిద్ధపడుతున్నారని సమాచారం. వర్క్ ఫ్రం హోంకు సంస్థలు ఒప్పుకోకపోతే ఉద్యోగానికి రాజీనామా చేసే మరో చోట ఉద్యోగం వెతుక్కోవాలని భావిస్తున్నారని సమాచారం. ఇక మన దగ్గరే పరిస్థితి ఇలా ఉంటే అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశాల్లో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఐటీ సంస్థలను ఇప్పుడు గ్రేట్ రిజిగ్నేషన్ బెంగ వెంటాడుతోంది. వర్క్ ఫ్రం హోం వద్దని అన్నందుకు ఇప్పటికే వేలాది మంది ఉద్యోగులు రిజైన్ చేశారు. వర్క్ ఫ్రమ్‌ హోమ్‌ వద్దన్నందుకు యాపిల్‌ సంస్థ ఏఐ డైరెక్టర్‌ ఇయాన్‌ గుడ్‌ఫెల్‌ తన జాబ్‌కు రిజైన్‌ చేసి సంచలనం సృష్టించారు. ఇక బైజూస్‌ అనే సంస్థకు కోడింగ్‌ స్టార్టప్‌ వైట్‌ హాట్‌ జూనియర్‌ క్యాడర్ కు చెందిన వందలాది మంది ఉద్యోగులు కూడా తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు.

దీంతో ఉద్యోగులను తిరిగి ఆఫీసులు తీసుకొచ్చేందుకు ఐటీ సంస్థలు పడరాని పాట్లు పడుతున్నాయి. ముందుగా వారానికి ఒకటి రెండు రోజులు ఆఫీసులకు రావాలని సూచించి ఆతర్వాత క్రమక్రమంగా వర్క్ ఫ్రం హోంకు స్వస్తి పలకాలని భావిస్తున్నాయి. అయితే ఐటీ ఉద్యోగులు ఇందుకు ఎంత సహకరిస్తారనే దానిపై ఇంకా స్పష్టత రాకపోవడంతో యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.

also read  వారానికి నాలుగు రోజులే వర్కింగ్ డేస్..The Pros and Cons of a 4 Day Working Week

also read  iPhone 15 Type C: Apple కొత్త మోడల్ iPhone 15లో USB టైప్-సి ఛార్జింగ్ పోర్ట్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News