/telugu/photo-gallery/rain-alert-expected-in-these-4-key-districts-of-telugu-states-imd-weather-alert-issued-rn-180901 AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక 180901

Income Tax Saving Tips: ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్‌ ఫైల్ చేయడానికి మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో ట్యాక్స్ సేవ్ చేసేందుకు పన్ను చెల్లింపుదారులు వివిధ మార్గాల కోసం వెతుకుతున్నారు. మార్చి 31వ తేదీలోపు ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉండగా.. కొన్ని ప్రభుత్వ పథకాల్లో పెట్టుబడి పెట్టి పన్ను ఆదా చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. కొత్త పన్ను విధానంలో పన్ను దాఖలు చేయడంపై వార్షిక ఆదాయం రూ.7 లక్షల వరకు ఎలాంటి ట్యాక్స్‌ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వ పథకాల్లో పెట్టుబడి పెట్డండి.. మీరూ ట్యాక్స్ సేవ్ చేసుకోండి.

ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్

మ్యూచువల్ ఫండ్‌కు సంబంధించిన ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టి మీరు ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు. ఇందులో మీరు రూ.100 నుంచి ఇన్వెస్ట్ మొదలుపెట్టవచ్చు. మీకు 10 నుంచి 12 శాతం ఆదాయం లభిస్తుంది. ఇందులో రూ. 1.5 లక్షల రూపాయల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. ఈ పథకంలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మంచి రాబడులు పొందవచ్చు.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్‌)

ప్రస్తుతం అత్యంత ఆదరణ పొందిన పథకాల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌ ఒకటి. ఇందులో ఎక్కువ పెట్టుబడి పెట్టడం ద్వారా ట్యాక్స్ బెనిఫిట్ పొందవచ్చు. ఈ పథకంలో మీరు రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.

ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్‌)

ఇది ట్యాక్స్ సేవ్ చేసుకోవాలనుకునేవారకి ప్రత్యేకమైన ప్లాన్. పదవీ విరమణ కోసం డబ్బును పొదుపు చేయాలనే ఆలోచనలో ఉన్నవారికి చాలా ఉపయోగపడుతుంది. ఈ పథకంలో పన్ను మినహాయింపు ప్రయోజనం లభిస్తుంది.

నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్‌పీఎస్)

ఇది ఒక రకమైన పన్ను ఆదా ప్లాన్. ఇందులో మీరు రూ. 50 వేల వరకు పెన్షన్ పొందవచ్చు. ఈ పథకంలో పన్ను మినహాయింపు ప్రయోజనం లభిస్తుంది.

జీవిత బీమా పాలసీ (ఎల్ఐసీ)

మీరు జీవిత బీమా పాలసీలో పెట్టుబడి పెట్టడం ద్వారా పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. మీరు ఇందులో 1.5 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టవచ్చు. మీకు ఇందులో ట్యాక్స్ సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. 

మీరు పాత పన్ను విధానంలో ఐటీఆర్ ఫైల్ చేస్తే.. అతను పన్ను విధించదగిన ఆదాయంపై పన్ను చెల్లించాలి. అదేసమయంలో ఈ పన్ను విధానంలో ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టంలోని సెక్షన్ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు రాయితీని కూడా పొందవచ్చు. ఈ నేపథ్యంలో మీరు కూడా పాత పన్ను విధానంలో పన్ను దాఖలు చేస్తుంటే.. మార్చి నెలలోనే ఏదో పథకంలో పెట్టుబడి పెట్టి పన్ను ఆదా చేసుకోండి. 

Also Read: Rahul Sipligunj Naatu Inspirational: పాతబస్తీ కుర్రోడు ఆస్కార్లో లైవ్ పెర్ఫార్మెన్స్.. ఇది కదా ఇన్స్పిరేషన్ అంటే!

Also Read: SS Rajamouli on Jr NTR: ఎన్టీఆర్‌ను చూసి 'ఓరి దేవుడా.. వీడు దొరికాడేంట్రా' అనుకున్నా.. కుంటి గుర్రంతో పోల్చిన రాజమౌళి!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Section: 
English Title: 
Tax Saving Tips 2023 You Can invest these govt schemes you can save tax along with good returns
News Source: 
Home Title: 

Tax Saving Tips: ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైల్ చేసే వారికి గమనిక.. పన్ను ఇలా ఆదా చేసుకోండి

Tax Saving Tips 2023: ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైల్ చేసే వారికి గమనిక.. పన్ను ఇలా ఆదా చేసుకోండి
Caption: 
Income Tax Saving Tips (Source: File)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Tax Saving Tips: ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైల్ చేసే వారికి గమనిక.. పన్ను ఇలా ఆదా చేసుకోండి
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Thursday, March 2, 2023 - 16:12
Created By: 
Krindinti Ashok
Updated By: 
Krindinti Ashok
Published By: 
Krindinti Ashok
Request Count: 
40
Is Breaking News: 
No