Tax Saving Schemes 2023: ఈ పథకంలో పెట్టుబడి పెట్టండి.. ఆదాయంతోపాటు సూపర్ బెనిఫిట్స్

Post Office Scheme: తక్కువ రిస్క్‌తో ఎక్కువ ఆదాయం వచ్చే పథకాల కోసం చూస్తున్నారా..? మీ డబ్బు సురక్షితంగా ఉండడంతో పాటు ఆదాయం కూడా డబుల్ అవుతుంది. అంతేకాదు ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. పూర్తి వివరాలు ఇలా..  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 18, 2023, 07:42 PM IST
Tax Saving Schemes 2023: ఈ పథకంలో పెట్టుబడి పెట్టండి.. ఆదాయంతోపాటు సూపర్ బెనిఫిట్స్

Post Office Scheme: ప్రస్తుతం పెట్టుబడి పెట్టేందుకు అనేక మాధ్యమాలు అందుబాటులో ఉన్నాయి. ప్రజలు తమ అవసరాలకు అనుగుణంగా వివిధ పథకాలలో పెట్టుబడి పెట్టవచ్చు. అయితే మీరు ట్యాక్స్‌ ఆదా చేయాలనుకుంటే.. ఇందుకు కూడా చాలా పథకాలు ఉన్నాయి. వీటిలో నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ పథకంలో పెట్టుబడి పెడితే మంచి లాభాలు ఉంటాయి. తక్కువ రిస్క్ పెట్టుబడితో.. అనేక ప్రయోజనాలతో ఉన్నాయి. ఏ పోస్టాఫీసు బ్రాంచ్‌లో అయినా అకౌంట్ ఓపెన్ చేయగల స్థిర ఆదాయ పెట్టుబడి పథకం నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ పథకం. 

ఇది పొదుపు బాండ్. ఇది ప్రధానంగా చిన్న, మధ్య ఆదాయ పెట్టుబడిదారులు, ఆదాయపు పన్ను మినహాయింపుకు అర్హులైన వారిపై పెట్టుబడి పెట్టడానికి వినియోగదారులను ప్రోత్సహిస్తుంది. పన్ను ఆదా చేస్తూ స్థిరమైన వడ్డీని సంపాదించడానికి సురక్షితమైన పెట్టుబడి మార్గం కోసం చూస్తున్న ఎవరైనా ఎన్‌ఎస్‌సీలో పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో హామీ వడ్డీ లభించడంతోపాటు పెట్టుబడి సురక్షితంగా ఉంటుంది.

ఈ పథకం ప్రస్తుతం 7 శాతం వార్షిక వడ్డీ రేటును అర్ధ-సంవత్సరానికి కలిపి అందిస్తోంది. అయితే మెచ్యూరిటీ సమయంలోనే నగదు తీసుకునేందుకు వీలుంంఉటంది. పీపీఎఫ్ పథకం మాదిరి కాకుండా.. ఇందులో ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు. పెట్టుబడి లిమిట్ లేదు. ఈ పథకంలో కనీస పెట్టుబడి 1000 రూపాయలు. కనీస పెట్టుబడి మొత్తాన్ని రూ.100 డినామినేషన్లతో పెంచుకోవచ్చు. ఈ పథకం కింద తెరిచిన ఖాతాల సంఖ్యపై పరిమితి లేదు. డిపాజిట్ మొత్తం ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు కిందకు వస్తుంది. 

Also Read: Amazon Offers: అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్.. స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్  

Also Read: Telangana Teacher Posts: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో 23 వేల టీచర్ పోస్టులు..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News