Old Vs New Tax Regime Calculator: 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారా..? అయితే కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవడం మర్చిపోవద్దు. ఈ ఏడాది బడ్జెట్‌లో ఆదాయపు పన్నుకు సంబంధించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పలు కీలక ప్రకటనలు చేశారు. కొత్త పన్ను విధానంలో పన్ను దాఖలుపై వార్షిక ఆదాయం రూ.7 లక్షలపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పారు. కానీ పాత పన్ను విధానంలో రాయితీ కారణంగా సంవత్సరానికి ఐదు లక్షల రూపాయల వరకు ఆదాయంపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే పాత పన్ను విధానంలో పెట్టుబడిపై మినహాయింపు పొందవచ్చు. కొత్త పన్ను విధానంలో పెట్టుబడి మినహాయింపు సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో కొత్త పన్ను విధానాన్ని ఎంచుకోవాలా లేదా పాత పన్ను విధానాన్ని ఎంచుకోవాలా అనే విషయంలో ట్యాక్స్ పేయర్లు గందరగోళానికి గురవుతున్నారు.
ఒక వ్యక్తి వార్షిక ఆదాయం రూ.7 లక్షల కంటే తక్కువగా ఉంటే.. మరో ఆలోచన లేకుండా కొత్త పన్ను విధానాన్ని ఎంచుకోవచ్చు. ఆ వ్యక్తి ఎటువంటి పన్ను దాఖలు చేయవలసిన అవసరం లేదు. అదే సమయంలో.. కొత్త పన్ను విధానంలో రూ.50 వేల స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనం కూడా అందుబాటులో ఉంది. రూ.7 లక్షల కంటే ఎక్కువ జీతం ఆదాయం కలిగిన వ్యక్తులు.. రూ. 7.5 లక్షల వరకు ఎటువంటి ట్యాక్స్‌ను దాఖలు చేయవలసిన అవసరం లేదు.
అధిక ఆదాయాన్ని ఆర్జించేవారికి కూడా కొత్త పన్ను విధానం సెక్షన్ 80C/సెక్షన్ 80D కింద ప్రయోజనాలను పెంచుకోవడానికి పెట్టుబడి పెట్టడం వల్ల గణనీయమైన మినహాయింపులు పొందవచ్చు. క్లెయిమ్ చేయలేని పన్ను చెల్లింపుదారులకు ఉపయోగకరంగా ఉంటుంది. మీరు మీ వార్షిక ఆదాయంలో 40 శాతం లేదా సెక్షన్ 80C, సెక్షన్ 80D, ఇంటి అద్దె, హోమ్ లోన్, ఏవైనా ఇతర మినహాయింపులతో కలుపుకుని రూ.4.5 లక్షలు (ఏది తక్కువైతే అది) సంపాదిస్తే.. మీరు పాత పన్ను విధానాన్ని ఎంచుకోవచ్చు.
తక్కువ నిబంధనలు, తక్కువ ట్యాక్స్ ఉండే విధానానికే ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు. ట్యాక్స్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉండే వారు పాత పన్ను విధానానమే కావాలని అంటున్నారు. తక్కువ మినహాయింపులు ఉన్నవారు కొత్త పన్ను విధానాన్ని ఎంచుకుంటున్నారు. ఇందులో వీరికి అధిక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రెండు పన్ను విధానాలను పోలిస్తే.. తక్కువ ట్యాక్స్ ఉండే విధానం ఎంచుకోవడం ఉత్తమం. ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్‌మెంట్, హోమ్, ఎడ్యుకేషన్ లోన్ వడ్డీ చెల్లింపులపై ఆధారపడి ఉంటుంది.
Also Read: Helicopter Crash: కూప్పకూలిన ఆర్మీ హెలికాఫ్టర్.. పైలట్ల కోసం సెర్చ్ ఆపరేషన్
Also Read: AP Budget 2023: రూ.2,79,279 కోట్లతో ఏపీ బడ్జెట్.. శాఖల వారీగా కేటాయింపులు ఇలా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి