Tata Micro SUV @ Rs 6 Lakhs: హ్యుండయ్ క్రెటా, వెన్యూలను తలదన్నే టాటా మోటార్స్ ఎస్‌యూవీ.. ధర కేవలం రూ.6 లక్షలే!

Tata Micro SUV @ Rs 6 Lakhs: టాటా మోటార్స్ వాహనాల్లో అత్యధికంగా విక్రయమయ్యే కారు ఏదో తెలుసా. అత్యంత చౌకైనా ఎస్‌యూవీ ఇది. ఫిబ్రవరి నుంచి ఈ కారు ఇతర కార్లను వెనక్కి నెట్టేసింది. అద్భుతమైన అమ్మకాలతో ముందుకు పోతోంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 16, 2023, 10:54 AM IST
Tata Micro SUV @ Rs 6 Lakhs: హ్యుండయ్ క్రెటా, వెన్యూలను తలదన్నే టాటా మోటార్స్ ఎస్‌యూవీ.. ధర కేవలం రూ.6 లక్షలే!

Tata Micro SUV @ Rs 6 Lakhs:ఇండియన్ మార్కెట్‌లో టాటా మోటార్స్ కార్లకు క్రేజ్ ఎక్కువ. చాలామంది ఇష్టపడుతుంటారు. ప్రస్తుతం టాటా నెక్సాన్ క్రేజ్ నడుస్తోంది. దేశంలో అత్యధికంగా విక్రయమౌతున్న బెస్ట్ ఎస్‌యూవీల్లో ఒకటి. ఫిబ్రవరి నెల విక్రయాల్లో అయితే మారుతి బ్రెజా సైతం వెనుకబడింది. టాటా మోటార్స్‌లో నెక్సాన్ తరువాత అత్యధికంగా విక్రయమౌతున్న మరో ఎస్‌యూవీ ఏంటో తెలుసా. ఈ ఎస్‌యూవీ ధర కేవలం 6 లక్షల నుంచే ప్రారంభమౌతుంది. ఫీచర్లు మాత్రం అద్భుతంగా ఉంటాయి. ఫిబ్రవరి నుంచి ఈ కారు అమ్మకాల్లో హ్యుండయ్ క్రేటా, వెన్యూలు వెనుకబడిపోయాయి.

ఈ కారు టాటా పంచ్ ఎస్‌యూవీ. ఫిబ్రవరి నెలలో దేశంలో అత్యధికంగా విక్రయమైన కార్లలో 9వ స్థానంలో ఉంది. హ్యుండయ్ క్రెటా, వెన్యూలు టాటా పంచ్ కంటే దిగువనే ఉన్నాయి. గత నెల టాటా పంచ్ 11,169 యూనిట్లు విక్రయాలు జరుపుకుంది. గత ఏటాది ఫిబ్రవరి నెల అమ్మకాలతో పోలిస్తే ఈ కారు అమ్మకాలు 16 శాతం పెరిగాయి. అటు హ్యుండయ్ క్రెటా 10,421, వెన్యూ 9,997 యూనిట్లు అమ్మకాలు నోట్ చేసింది. 

టాటా పంచ్ ధర..

టాటా మోటార్స్ ఇటవలే టాటా పంచ్ ఎస్‌యూవీ ధరను 10 వేలు పెంచింది. ఈ మైక్రో ఎస్‌యూవీ ధర 6 లక్షల నుంచి ప్రారంభమై 9.47 లక్షల వరకూ ఉంటుంది. ఇందులో నాలుగు వేరియంట్లు ప్యూర్, అడ్వెంచర్ ఎక్కంప్లిష్డ్, క్రియేటివ్ ఉన్నాయి.  ఇందులో గరిష్టంగా 5 మంది కూర్చోవచ్చు. టాటా ఈ మైక్రో ఎస్‌యూవీని 366 లీటర్ బూట్ స్పేస్‌తో నిర్మించింది. 

టాటా పంచ్ ఫీచర్లు..

టాటా పంచ్ ఫీచర్లలో 7 ఇంచెస్ టచ్ స్క్రీన్ డిస్‌ప్లే, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, ఆటో ఎయిర్ కండీషనింగ్, ఆటోమేటిక్ హెడ్ లైట్స్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, క్రూయిజ్ కంట్రోల్ ఉన్నాయి. రక్షణ కోసం డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్, ఈబీడీ విత్ ఏబీఎస్, రేర్ డిఫాగర్, రేర్ పార్కింగ్ సెన్సార్, రేర్ వ్యూ కెమేరా ఉన్నాయి. ఈ కారును మహీంద్ర 100, మారుతి ఇగ్నిస్, నిస్సాన్ మాగ్నైట్, రీనాల్ట్ కైగర్‌తో పోల్చవచ్చు.

Also read: Vizag Steel: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదు, తేల్చి చెప్పేసిన కేంద్ర ప్రభుత్వం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News