SUPR DAILY అందరి మన్నలను పొందిన ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ప్రధాన నిర్ణయం తీసుకుంది. తన ‘సూపర్ డైలీ’ సర్వీసులను దేశంలోని ఐదు ప్రధాన నగరాలలో మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సూపర్ డైలీ సేవల కింది స్వీగ్గీ నిత్యావసర వస్తువులను, పాలను, ఇతర గృహోపకరణ పస్తువులను డెలివరీ చేస్తోంది. సంస్థ సబ్‌స్క్రైబర్ లకు ఈ సేవలు అందిస్తోంది. సబ్స్క్రిప్షన్ తీసుకున్న వినియోగదారులకు ఈ సేవలను ఐదు ప్రధాన నగరాల్లో స్వీగ్గీ అందిస్తోంది. అయితే ఈ సేవలో అంతగా రాబడి లేకపోవడంతో చాలా కాలంగా ఇబ్బందిపడుతున్న స్విగ్గీ చివరకు ఈ సర్వీసును తాత్కాలికంగా రద్దు చేసింది. ఖర్చులను తగ్గించుకోవడంతో నష్టాలను నుంచి బయటపడాలని భావిస్తోంది. నష్టాల నుంచి బయటపడాలని భావిస్తున్న స్విగ్గీ ముందు ఈ నిర్ణయం తీసుకుంది.
దేశ రాజధాని ఢిల్లీ సహా ముంబై, చెన్నై, పుణేలో ఈ సర్వీసలు స్విగ్గీ అందిస్తోంది. మే 12, 2022 నుంచి సూపర్ డైలీ సేవలు నిలిచిపోతాయని స్విగ్గీ ఉన్నతాధికారులు ప్రకటించారు. ఇందులో భాగంగా మే 11 నుంచే కొత్త ఆర్డర్లు తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. ఇక ఈపాటికే బుక్ చేసుకున్న కస్టమర్లు తమ వాలెట్లలో జమ చేసిన డబ్బులను తిరిగి ఇచ్చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ రీఫండ్ ప్రక్రియ పూర్తి అయ్యేందుకు వారం, పది రోజుల సమయం పడుతుందని వివరించారు. అయితే సూపర్ డైలీ సేవలు బెంగళూరులో మాత్రం కొనసాగుతాయని స్పష్టం చేశారు. బెంగళూరులో ఈ సేవలను ప్రస్తుతానికి కొనసాగిస్తామని వెల్లడించారు. భవిష్యత్తులో బెంగళూరులో ఈ సేవలను మరింత విస్తరించే యోచనలో తాము ఉన్నామని వెల్లడించారు.
ఈ అంశాలను స్వీగ్గీ ఉద్యోగులకు సూపర్ డైలీ సీఈవో ఫని కిషన్ లేఖ ద్వారా తెలియజేశారు. ప్రజా జీవితంలో కీలకమైన భాగస్వామ్యంలో ఉన్న తాము నష్టాల నుంచి తప్పించుకునేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో సూపర్ డైలీ సేవలకు స్వస్తి పలుకుతున్నామని అన్నారు. సూపర్ డైలీ పేరుతో స్టార్టప్ కంపెనీని ఐఐటీ బొంబై గ్రాడ్యుయేట్స్ శ్రేయాస్ నాగ్దావనే, పునీత్ కుమార్‌లు 2015లో ప్రారంభించారు. ఈ సర్వీసు బాగా క్లిక్ అవడంతో స్విగ్గీ ఈ సంస్థను 2018 సెప్టెంబర్‌లో కొనుగోలు చేసింది. భారీ పెట్టుబడి పెట్టి కొన్న ఈ సంస్థను స్వీగ్గీ సరిగ్గా నడపలేకపోయింది. దీంతో నష్టాల బాట పట్టాల్సి వచ్చింది. దీంతో చివరకు సేవలకు స్వస్తి పలికింది.
also read SBI FD Interest Rates: ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాదారులకు ఎస్బీఐ గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లు పెంపు
also read Facebook Features: ఇక నుంచి Facebookలో ఈ 2 ఫీచర్లు పనిచేయవు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook