Swiggy leave offer: స్విగ్గీలో మహిళా ఉద్యోగులకు నెలకు రెండు పెయిడ్ లీవ్స్.. కారణం చెప్పాల్సిన అవసరం కూడా లేదు

Swiggy: విమెన్ డెలివరీ పార్ట్​నర్స్​కు స్విగ్గీ నెలకు రెండు రోజుల పెయిడ్​ లీవ్స్ ఇచ్చేదుకు సిద్ధమైంది. మహిళలకు ఉండే ఇబ్బందలను దృష్టిలో ఉంచుకుని కారణం చెప్పాల్సి అవసరం లేకుండానే లీవ్స్ తీసుకునేలా వెసులుబాటు కల్పించింది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 22, 2021, 07:44 PM IST
  • విమెన్ డెలివరీ పార్ట్​నర్స్​కు స్విగ్గీ గుడ్​ న్యూస్​
  • నెలకు రెండు పెయిడ్​ లీవ్స్​
  • కారణం చెప్పాల్సిన అవసరం కూడా లేదు
  • సాయంత్రం 6 వరకే మహిళలకు డ్యూటీ
Swiggy leave offer: స్విగ్గీలో మహిళా ఉద్యోగులకు నెలకు రెండు పెయిడ్ లీవ్స్.. కారణం చెప్పాల్సిన అవసరం కూడా లేదు

Swiggy leave offer: ఆన్​లైన్ ఫుడ్ డెలివరీ సేవల సంస్థ స్విగ్గీ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా ఉద్యోగులకు (డెలివరీ పార్ట్​నర్స్​కు) సెలవుల విషయంలో వినూత్న వెసులుబాటు కల్పించేందుకు సిద్ధమైంది.

మహిళలకు ఉండే శారీరక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని.. నెలలో రెండు రోజులు వేతనంతో కూడిన సెలవులు తీసుకునేలా వెసులుబాటు ఇవనుంది. అయితే ఈ లీవ్స్​ గురించి ఎలాంటి కారణం చెప్పాల్సిన పని లేదని స్విగ్గీ ఆపరేషన్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మిహిర్ షా తన బ్లాగ్​లో రాసుకొచ్చారు.

మిహిర్ షా బ్లాగ్​లో ఏముందంటే..

'మహిళలు నెలసరి సమయంలో బయటకు రావాలంటే ఇబ్బంది పడుతుంటారు. ఆ విషయాన్ని బయట చెప్పాలన్నా వాళ్లకు ఇబ్బందే. డెలివరీ పార్ట్​నర్​గా మహిళలు చేరకపోవడానికి ఇది కూడా ఓ కారణంగా భావిస్తున్నాం. అందుకే అలాంటి మహిళలకు అండగా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నాం' అని మిహిర్ తన బ్లాగ్​లో పేర్కొన్నారు.

స్విగ్గీ 2016 నుంచి మహిళలను కూడా డెలివరీ పార్ట్​నర్స్​గా చేర్చుకోవడం ప్రారంభించింది. దేశవ్యాప్తంగా స్విగ్గీలో ప్రస్తుతం 1000కి పైగా విమెన్​ డెలివరీ పార్ట్​నర్స్ ఉన్నారు. అందులో 99 శాతం మంది​ 45 ఏళ్ల లోపు వయసు వారే. వారిలో 89 శాతం మందికి కనీసం ఒక సంతానం ఉన్నట్లు తెలిసింది. స్విగ్గీ తీసుకున్న ఈ నిర్ణయంతో డెలివరీ మహిళా ఉద్యోగులకు ఊరట లభిస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Also read: Health benefits of Sesame oil: నువ్వుల నూనెతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

అయితే లీవ్స్​తో పాటు మహిళా ఉద్యోగుల పని సమయాల్లోనూ మార్పులు చేసింది స్విగ్గీ. విమెన్ డెలివరీ పార్ట్​నర్స్​ డ్యూటీ సాయంత్రం 6 వరకే పరిమితం చేసింది. నిజానికి సాయంత్రం డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ మహిళాల భద్రత కోసం స్విగ్గీ ఈ నిర్ణయం తీసుకుంది.

Also read: Amazon prime Price hike: షాకిచ్చిన అమెజాన్​- 50 శాతం పెరగనున్న ప్రైమ్ సబ్​స్క్రిప్షన్ ధరలు!

Also read: Petrol Price Hiked: దేశంలో ఆగని పెట్రో మోత- వరుసగా మూడో రోజు ధరల పెంపు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News