Stocks today: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా సానుకూలతలు పెరుగుతున్న నేపథ్యంలో సూచీలు లాభాలను నమోదు చేశాయి. బీఎస్ఈ- సెన్సెక్స్ 817 పాయిట్లు పెరిగి 55,464 వద్దకు చేరింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 249 పాయింట్ల లాభంతో 16,595 వద్ద స్థిరపడింది.
కారణాలివే..
ఇటీవల వరుస నష్టాలకు కారణమైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇప్పుడిప్పుడే సద్ధుమనుగుతున్న నేపథ్యంలో సానుకూలతలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఇరు దేశాలు చర్చల దిశగా సమస్యల పరిష్కారానికి అడుగులు వేయడం కలిసొచ్చింది. దీనితో మూడు రోజులుగా సూచీలు సానుకూలంగా స్పందిస్తున్నాయి అని నిపుణులు చెబుతున్నారు.
మరోవైపు 2014 ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కూడా మార్కెట్లను ప్రభావితం చేసినట్లు తెలుస్తోంది. పంజాబ్ మినహా.. యూపీ, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాల్లో బీజేపీ ఆధికారంలోకి రానున్నట్లు దాదాపు ఖరారైంది. ఇక పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈ పరిణామాలు కూడా మార్కెట్ల లాభాలకు కారణంగా చెబుతున్నారు విశ్లేషకులు.
సూచీల కదలికలు ఇలా..
ఇంట్రాడేలో సెన్సెక్స్ 53,242 పాయింట్ల అత్యధిక స్థాయిని నమోదు చేసింది. 54,982 కనిష్ఠానికీ పడిపోయింది.
నిఫ్టీ అత్యధికంగా 16,757 పాయింట్ల స్థాయిని తాకింది. ఓ దశలో 17 వేల మార్క్ కోల్పోయి.. 16,447 వద్దకూ తగ్గింది.
నేటి సెషన్లో టాప్-5 షేర్లు..
హిందుస్థాన్ యూనీలీవర్ 5.17 శాతం, టాటా స్టీల్ 4.27 శాతం, ఎస్బీఐ 3.45 శాతం, ఇండస్ఇండ్ బ్యాంక్ 3.28 శాతం, యాక్సిస్ బ్యాంక్ 3.12 శాతం లాభాలను గడించాయి.
టెక్ మహీంద్రా 1.48 శాతం, డాక్టర్ రెడ్డీస్ 0.78 శాతం, టీసీఎస్ 0.36 శాతం నష్టాలను నమోదు చేశాయి.
Also read: Bank Loans: బ్యాంకు లోన్ తీసుకునేటప్పుడు తప్పకుండా తెలుసుకోవల్సిన అంశాలివే
Also read: Interest Rates: కోటక్ మహీంద్రా గుడ్‌న్యూస్, ఆ డిపాజిట్లపై వడ్డీ రేట్ల పెంపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook