Stock Market today: స్టాక్ మార్కెట్లో లాభాల పరంపర- 61 వేల మార్క్​పైకి సెన్సెక్స్​

Stock Market today: స్టాక్ మార్కెట్లలో వరుసగా నాలుగో రోజూ బుల్ జోరు కొనసాగింది. బుధవారం సెషన్​లో (stocks closing bell) ఆటో, బ్యాంకింగ్ రంగాలు సానుకూలంగా స్పందించాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 12, 2022, 03:44 PM IST
  • స్టాక్ మార్కెట్లలో నాలుగో రోజూ బుల్​ జోష్​
  • 61 వేల మార్క్​పైకి చేరిన సెన్సెక్స్​
  • ఆటో, బ్యాంకింగ్ రంగాల్లో సానుకూలతలు
Stock Market today: స్టాక్ మార్కెట్లో లాభాల పరంపర- 61 వేల మార్క్​పైకి సెన్సెక్స్​

Stock Market today: స్టాక్ మార్కెట్లలో లాభాల పరంపర కొనసాగుతోంది. నేటి సెషన్​లో సూచీలు భారీ లాభాలను (stocks closing bell) నమోదు చేశాయి.

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ- సెన్సెక్స్​ (BSE Sensex) 507 పాయింట్లు బలపడి 61,124 వద్దకు చేరింది. నేషనల్​ స్టాక్ ఎక్స్ఛేంజీ-నిఫ్టీ (NSE Nify) 157 పాయింట్ల లాభంతో 18,212 వద్ద స్థిరపడింది. సూచీలు లాభాలను నమోదు చేయడం వరుసగా ఇది నాలుగో సెషన్​.

ఆటో, బ్యాంకింగ్​ షేర్లు అధికంగా లాభాలను నమోదు చేశాయి.  ఐటీ షేర్లు కాస్త డీలా పడ్డాయి.

దేశవ్యాప్తంగా కరోనా కేసులు, లాక్​డౌన్ భయాలు వెంటాడుతున్నా స్టాక్ మార్కెట్లు ముందుకే సాగుతుండటం విశేషం.

ఈ రోజు సెషన్​ ఎలా సాగిందంటే..

ఇంట్రాడేలో (Intraday) సెన్సెక్స్​   61,218 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. అమ్మకాల కారణంగా ఒకానొక దశలో  60,850 కనిష్ఠానికి పడిపోయింది.

నిఫ్టీ కూడా ఇంట్రాడేలో 18,228 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. 18,128 పాయింట్ల కనిష్ఠాన్ని తాకింది.

లాభ నష్టాల్లో టాప్​-5 షేర్లు..

బీఎస్​ఈ 30 షేర్ల ఇండెక్స్​లో 24 కంపెనీలు లాభాలను నమోదు చేశాయి. మిగతా 6 కంపెనీలు డీలా పడ్డాయి.

ఎం&ఎం 4.59 శాతం, భారతీ ఎయిర్​టెల్​ 3.75 శాతం, ఇండస్​ ఇండ్ బ్యాంక్​ 2.67 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్​ 2.61 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 1.61 శాతం లాభాలను నమోదు చేశాయి.

టైటాన్​ 1.56 శాతం, టీసీఎస్​ 1.47 శాతం, టెక్​ మహీంద్రా 0.78 శాతం, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ 0.62 శాతం, విప్రో 0.30 శాతం నష్టాలను మూటగట్టుకున్నాయి.

ఆసియాలో ఇతర మార్కెట్లు..

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లను పరిశీలిస్తే.. షాంఘై (చైనా), టోక్యో (జపాన్​), సియోల్​ (దక్షిణ కొరియా), థైవాన్​, హాంగ్​ సెంగ్​ (హాంకాంగ్​) సూచీలు లాభాలను భారీగా లాభాలను నమోదు చేశాయి.

రూపాయి విలువ..

డాలర్​తో పోలిస్తే రూపాయి 6 పైసలు క్షీణించింది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ (Rupee value today) రూ.73.96 వద్ద కొనసాగుతోంది.

Also read: Petrol Diesel Update: వాహనదారులకు గుడ్ న్యూస్- 50 లీటర్ల పెట్రోల్ లేదా డీజిల్ ఫ్రీగా పొందండి!

Also read: Todays Gold Rate: దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News