Stock Market today: స్టాక్ మార్కెట్లు 2021కి (Stocks Closing bell) లాభాలతో గుడ్‌బై చెప్పాయి.
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ- సెన్సెక్స్ (BSE Sensex) 459 పాయింట్లు పెరిగి 58,254 వద్దకు చేరింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ-నిఫ్టీ (NSE Nify) 154 పాయింట్ల లాభంతో 17,357 వద్ద స్థిరపడింది.
దాదాపు అన్ని రంగాలు లాభాలను నమోదు చేశాయి. బ్యాంకింగ్, ఆటో, ఎఫ్ఎంసీజీ రంగాలు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
2021లో సూచీల రికార్డులు ఇలా..
ఈ ఏడాది స్టాక్ మార్కెట్లు రికార్డులు సృష్టించాయి. ఈ ఏడాది జనవరి 1న సెన్సెక్స్ 47,869 ఉండగా.. ఈ ఏడాదే 50 వేల మార్క్, 60 వేల మార్క్‌ను తాకింది. ఈ ఏడాదికి 62,245 పాయింట్లు సెన్సెక్స్ జీవనకాల గరిష్ఠ స్థాయి.
ఇక నిఫ్టీ 14,019 వద్ద ఈ ఏడాదిని ప్రారంభించింది. 2021లో నిఫ్టీ జీవనకాల గరిష్ఠ స్థాయి 18,604 పాయింట్లు. రెండు సూచీలు అక్టోబర్ 19న రికార్డు స్థాయిలను తాకాయి.
ఈ రోజు సెషన్ ఎలా సాగిందంటే..
ఇంట్రాడేలో (Intraday) సెన్సెక్స్ 58,409 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. అమ్మకాల కారణంగా ఒకానొక దశలో 57,846 కనిష్ఠానికి పడిపోయింది.
నిఫ్టీ కూడా ఇంట్రాడేలో 17,400 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. 17,238 పాయింట్ల కనిష్ఠాన్ని తాకింది.
లాభ నష్టాల్లో టాప్-5 షేర్లు..
బీఎస్ఈ 30 షేర్ల ఇండెక్స్‌లో 26 కంపెనీలు లాభాలను నమోదు చేశాయి. మిగతా 4 కంపెనీలు డీలా పడ్డాయి.
టైటాన్ 3.50 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 2.68 శాతం, కోటక్ మహీంద్రా 2.45 శాతం, ఎస్బీఐ 1.91 శాతం, మారుతీ 1.86 శాతం లాభాలను గడించాయి.
ఎన్టీపీసీ 1.97 శాతం, టెక్ మహీంద్రా 0.53 శాతం, పవర్‌గ్రిడ్ 0.41 శాతం, డాక్టర్ రెడ్డీస్ 0.04 శాతం నష్టాలను మూటగట్టుకున్నాయి.
ఆసియాలో ఇతర మార్కెట్లు..
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లను పరిశీలిస్తే.. షాంఘై (చైనా), హాంగ్ సెంగ్ (హాంకాంగ్) సూచీలు లాభాలను గడించాయి.
టోక్యో (జపాన్), సియోల్ (దక్షిణ కొరియా), థైవాన్ సూచీలు సెలవులో ఉన్నాయి.
రూపాయి విలువ..
డాలర్‌తో పోలిస్తే రూపాయి 8 పైసలు బలపడింది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.74.33 వద్ద కొనసాగుతోంది.
Also read: Bank holidays 2022: వచ్చే ఏడాది బ్యాంక్ సెలవుల జాబితా ఇదే..
Also read: New Rules from 2022: ఏటీఎం ఛార్జీల నుంచి లాకర్ల భద్రత వరకు రేపటి నుంచి మార్పులు ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook