Stock Market today: వారాంతపు సెషన్​లో ఫ్లాట్​గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

Stock Market today: స్టాక్ మార్కెట్ల వరుస లాభాల జోరుకు బ్రేక్ పడింది. వారాంతపు సెషన్​లో (stocks closing bell) అతి స్వల్ప నష్టాలతో ముగిశాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 14, 2022, 03:56 PM IST
  • స్టాక్ మార్కెట్లలో బుల్​ జోరుకు బ్రేక్​
  • వారాంతంలో లాభాల స్వీకరణకు దిగిన మదుపరులు
  • 61,200 పైనే స్థిరపడిన సెన్సెక్స్​
  • ఐటీ షేర్లలో మాత్రం భారీ లాభాలు
Stock Market today: వారాంతపు సెషన్​లో ఫ్లాట్​గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

Stock Market today: స్టాక్ మార్కెట్లలో వరుస లాభాలకు వారాంతంలో అడ్డుకట్ట పడింది. నేటి సెషన్​లో (శుక్రవారం) సూచీలు ఫ్లాట్​గా (stocks closing bell) ముగిశాయి.

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ- సెన్సెక్స్​ (BSE Sensex) 12 పాయింట్లు తగ్గి 61,233 వద్దకు చేరింది. నేషనల్​ స్టాక్ ఎక్స్ఛేంజీ-నిఫ్టీ (NSE Nify) 2 పాయింట్ల అతి స్వల్ప నష్టంతో 18,255 వద్ద స్థిరపడింది.

ఇటీవలి వరుస లాభాలను మదుపరులు సొమ్ము చేసుకునే పనిలో పడ్డారు. ఫలితంగా సూచీలు నేటి ఇంట్రాడేలో భారీ నష్టాలను నమోదు చేశాయి. అయితే ఐటీ షేర్ల అండతో చివరకు ఫ్లాట్​గా స్థిరపడ్డాయి. 

ఈ రోజు సెషన్​ ఎలా సాగిందంటే..

ఇంట్రాడేలో (Intraday) సెన్సెక్స్​ 61,324 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. అమ్మకాల కారణంగా ఒకానొక దశలో 60,757 కనిష్ఠానికి పడిపోయింది.

నిఫ్టీ కూడా ఇంట్రాడేలో 18,286 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. 18,119 పాయింట్ల కనిష్ఠాన్ని తాకింది.

లాభ నష్టాల్లో టాప్​-5 షేర్లు..

బీఎస్​ఈ 30 షేర్ల ఇండెక్స్​లో 13 కంపెనీలు లాభాలను నమోదు చేశాయి. మిగతా 17 కంపెనీలు డీలా పడ్డాయి.

టీసీఎస్​ 1.84 శాతం, ఇన్ఫోసిస్​ 1.64 శాతం, ఎల్​&టీ 1.32 శాతం, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ 1.11 శాతం, టెక్ మహీంద్రా 0.88 శాతం లాభాలను గడించాయి.

ఏషియన్ పెయింట్స్​ 2.65 శాతం, యాక్సిస్ బ్యాంక్ 2.62 శాతం, హెచ్​యూఎల్​ 2.13 శాతం, విప్రో 1.55 శాతం, ఎం&ఎం 1.53 శాతం నష్టపోయాయి.

ఆసియాలో ఇతర మార్కెట్లు..

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లను పరిశీలిస్తే.. షాంఘై (చైనా), టోక్యో (జపాన్​), సియోల్​ (దక్షిణ కొరియా), థైవాన్​, హాంగ్​ సెంగ్​ (హాంకాంగ్​) సూచీలు నష్టపోయాయి.

రూపాయి విలువ..

డాలర్​తో పోలిస్తే రూపాయి 28 పైసలు క్షీణించింది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.74.16 వద్ద (Rupee Value today) కొనసాగుతోంది.

Also read: Gold Price Today : దేశీయ మార్కెట్‌లో పెరిగిన బంగారం ధరలు.. పూర్తి వివరాలివే...

Also read: Whatsapp Voice Message: వాట్సప్ లో మరో కొత్త ఫీచర్.. వాయిస్ మెసేజ్ వింటూనే చాటింగ్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News