Stocks today: స్టాక్ మార్కెట్లను వీడని రష్యా-ఉక్రెయిన్​ భయాలు- ఐదో రోజు తప్పని నష్టాలు!

Stocks today: రష్యా-ఉక్రెయిన్ వివాదం భయాలు స్టాక్ మార్కెట్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మంగళవారం సెషన్​లో సెన్సెక్స్​ 383 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 114 పాయింట్లు తగ్గింది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 22, 2022, 04:15 PM IST
  • మరోసారి నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
  • రష్యా-ఉక్రెయిన్ మధ్య వివాదాలే కారణం
  • ఒడుదొడుకులు తాత్కాలికమేనంటున్న నిపుణులు
Stocks today: స్టాక్ మార్కెట్లను వీడని రష్యా-ఉక్రెయిన్​ భయాలు- ఐదో రోజు తప్పని నష్టాలు!

Stocks today: స్టాక్ మార్కెట్లకు వరుసగా ఐదో రోజు నష్టాలు తప్పలేదు. మంగళవారం సెషన్​లో బీఎస్​ఈ- సెన్సెక్స్ 383 పాయింట్లు కోల్పోయింది. దీనితో 58,300 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ- నిఫ్టీ 114 పాయింట్లు నష్టపోయి 17,092 స్థిరపడింది.

రష్యా-ఉక్రెయిన్ మధ్య వివాదం సద్దుమనగకపోవడం మార్కెట్ల నష్టాలకు అసలు కారణం. గత వారం రోజులుగా ఇరు దేశాలు చేస్తున్న ప్రకటనలు అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దీనితో దేశీయ మార్కెట్లు వరుస నష్టాలను నమోదు చేస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

స్టాక్ మార్కెట్లు భారీగా నష్టాలను నమోదు చేసినప్పటికీ ఇది తాత్కాలికమైన పరిస్థితేనని స్టాక్ మార్కెట్ నిపుణులు, ఐఐఎఫ్​ఎల్​ డైరెక్టర్ సంజీవ్​ బాసిన్​ జీ బిజినెస్​తో చెప్పారు.

ఈ రోజు సెషన్​ గరిష్ఠ, కనిష్ఠ స్థాయిలు ఇవే..

ఇంట్రాడేలో సెన్సెక్స్ 57,505 పాయింట్ల అత్యధిక స్థాయిని నమోదు చేసింది. ఇది నేటి ఓపెనింగ్ కన్నా తక్కువ. మిడ్​ సెషన్​లో నమోదైన అమ్మకాల కారణంగా 57,394 వద్దకు పడిపోయింది.

నిఫ్టీ అత్యధికంగా 17,148 పాయింట్ల స్థాయిని తాకింది. ఓ దశలో 17 వేల మార్క్ కోల్పోయి.. 16,843 వద్దకు చేరింది.

నేటి సెషన్​లో టాప్​-5 షేర్లు..

30 షేర్ల ఇండెక్స్​లో 10 షేర్లు లాభాలను, 20 షేర్లు నష్టాలను నమోదు చేశాయి.

ఎం&ఎం 1.78 శాతం, బజాజ్ ఫిన్​సర్వ్​ 1.43 శాతం, కోటక్ మహీంద్రా బ్యాంక్ 0.85 శాతం, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ 0.62 శాతం, సన్​ఫార్మా 0.37 శాతం లాభాలను నమోదు చేశాయి.

టాటా స్టీల్​ 3.64 శాతం, టీసీఎస్​ 3.59 శాతం, ఎస్​బీఐ 2.67 శాతం, డాక్టర్​ రెడ్డీస్​ 2.08 శాతం, ఇండస్​ ఇండి బ్యాంక్ 1.51 శాతం చొప్పున నష్టాపోయాయి.

Also read: Special Festival Advance Scheme: ఆ ఉద్యోగులకు రూ.10 వేలు పండుగ అడ్వాన్స్!

Also read: Corbevax vaccine: పిల్లలకూ కొర్బీవాక్స్​- డీసీజీఐ అనుమతులు మంజూరు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News