Stock Market today: స్టాక మార్కెట్లకు మళ్లీ నష్టాలు- ఐటీ షేర్లు కుదేలు..!

Stock Market today: స్టాక్ మార్కెట్లు మరోసారి నష్టాలతో (stocks closing bell) ముగిశాయి. గురువారం సెషన్​లో ఐటీ షేర్లు కుదేలయ్యాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 27, 2022, 03:48 PM IST
  • మళ్లీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
  • ఐటీ షేర్లలో భారీగా అమ్మకాల ఒత్తిడి
  • కాస్త సానుకూలంగా స్పందించిన బ్యాంకింగ్ షేర్లు
Stock Market today: స్టాక మార్కెట్లకు మళ్లీ నష్టాలు- ఐటీ షేర్లు కుదేలు..!

Stock Market today: స్టాక్ మార్కెట్లకు లాభాలు ఒక్కరోజు ముచ్చటగానే మిగిలాయి. గురువారం సెషన్​లో మళ్లీ (stocks closing bell) నష్టాలను నమోదు చేశాయి సూచీలు.

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ- సెన్సెక్స్​ (BSE Sensex) 581 పాయింట్లు తగ్గి 57,276 వద్దకు చేరింది. నేషనల్​ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ-నిఫ్టీ (NSE Nify) 167 పాయింట్ల నష్టంతో 17,110 వద్ద స్థిరపడింది.

వరుసగా ఆరు సెషన్లలో నష్టపోయిన స్టాక్ మార్కెట్లు మంగళవారం (జనవరి 25న) కాస్త తేరుకున్నాయి. అయితే బుధవారం (గణతంత్ర దినోత్సవం) సెలవు తర్వాత.. నేటి సెషన్​లో మళ్లీ కుప్పకూలాయి. అంతర్జాతీయంగా దాదాపు అన్ని స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోవడంతో ఆ ప్రభావం దేశీయ సూచీలపై పడిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

నేటి సెషన్​లో ఐటీ, ఎఫ్​ఎంసీజీ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. బ్యాంకింగ్, ఆటోమొబైల్ షేర్లు కాస్త సానుకూలంగా స్పందించాయి.

ఈ రోజు సెషన్​ ఎలా సాగిందంటే..

ఇంట్రాడేలో (Intraday) సెన్సెక్స్​ 57,508 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. అమ్మకాల కారణంగా ఒకానొక దశలో 56,439 కనిష్ఠానికి పడిపోయింది.

నిఫ్టీ కూడా ఇంట్రాడేలో 17,182 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. 16,866 పాయింట్ల కనిష్ఠాన్ని తాకింది.

లాభ నష్టాల్లో టాప్​-5 షేర్లు..

బీఎస్​ఈ 30 షేర్ల ఇండెక్స్​లో 9 కంపెనీలు మాత్రమే లాభాలను నమోదు చేశాయి. మిగతా 21 కంపెనీలు డీలా పడ్డాయి.

యాక్సిస్ బ్యాంక్ 3.33 శాతం, మారుతీ సుజుకీ 2.98 శాతం, కోటక్ మహీంద్రా బ్యాంక్ 2.32 శాతం, ఇండస్​ఇండ్ బ్యాంక్ 1.05 శాతం లాభాలను గడించాయి.

హెచ్​సీఎల్​టెక్ 3.98 శాతం, టెక్ మహీంద్రా 3.46 శాతం, డాక్టర్​ రెడ్డీస్​ 3.37 శాతం, విప్రో 3.15 శాతం, టీసీఎస్​ 3.11 శాతం నష్టపోయాయి.

ఆసియాలో ఇతర మార్కెట్లు..

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లను పరిశీలిస్తే.. షాంఘై (చైనా), టోక్యో (జపాన్​), సియోల్​ (దక్షిణ కొరియా), హాంగ్​ సెంగ్​ (హాంకాంగ్​) సూచీలు నష్టపోయాయి. థైవాన్​ సూచీ సెలవులో ఉంది.

రూపాయి విలువ..

డాలర్​తో పోలిస్తే రూపాయి 30 పైసలు తగ్గింది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.75.07 వద్ద (Rupee Value today) కొనసాగుతోంది.

Also read: Jio Recharge Plan: జియో కస్టమర్లకు బంపర్ ఆఫర్.. రూ.150లకే అన్ లిమిటెడ్ కాల్స్, హైస్పీడ్ డేటా

Also read: Today Gold Price : దేశంలో మళ్లీ పెరిగిన బంగారం ధర...10 గ్రాముల పసిడి ధర ఎంతంటే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News