ITR Return Refund: 2024 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్ (ITR ఫైలింగ్ 2024) ఫైల్ చేసేందుకు కేవలం 4 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. జూలై 31 లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. ఐటీఆర్ దాఖలు చేయడానికి ఇప్పటికే చివరి రోజును పొడిగించే ప్రసక్తే లేదని ఐటీ శాఖ అధికారులు తెలిపారు. అయితే ఎవరైతే చెల్లించాల్సిన పన్ను కంటే ఎక్కువ పన్ను చెల్లించిన చాలా మంది తమ టాక్స్ రిటర్న్ పొందడానికి సైతం ITR ఫైల్ చేస్తుంటారు. అదనపు పన్ను చెల్లించినట్లయితే, ఆదాయపు పన్ను శాఖ అదనపు పన్ను మొత్తాన్ని తిరిగి ఇస్తుందన్న విషయం గమనించాలి. దీన్ని టాక్స్ రీఫండ్ అని అంటారు. అయితే ఐటీఆర్ ఫైల్ చేసిన అనంతరం మీరు దాఖలు చేసిన ITRని ప్రాసెస్ చేసినప్పుడు మీరు ఐటీ రీఫండ్ స్టేటస్ చెక్ చేసుకునే అవకాశం కలుగుతుంది.
ITR రిటర్న్ రీఫండ్ పొందడానికి ఆన్ లైన్ ద్వారా స్టెప్ బై స్టెప్ తెలుసుకోండి:
మీరు నిర్ణీత గడువులోపు రిటర్న్ (ITR) దాఖలు చేయడంతో పాటు, రీఫండ్ డబ్బు మీ బ్యాంక్ ఖాతాకు త్వరగా వస్తుందని భావించడం సహజమే. నిజానికి గతంలో కన్నా కూడా ఆదాయపు పన్ను శాఖ త్వరగా రీఫండ్‌లను ప్రాసెస్ చేస్తుంది. రీఫండ్ మీ బ్యాంక్ ఖాతాకు నేరుగా జమ అవుతోంది. కాబట్టి ITR ఫైల్ చేస్తున్నప్పుడు, మీరు మీ బ్యాంక్ ఖాతా నంబర్, IFSC కోడ్‌ని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవడం తప్పనిసరి. .
ఆదాయపు పన్ను రిఫండ్ స్టేటస్ ఎలా ట్రాక్ చేయాలి?
మీరు మీ ITRని ఫైల్ చేసి, ఇప్పుడు ITR రీఫండ్ స్టేటస్ చెక్ చేయాలనుకుంటే, క్రింద పేర్కొన్న స్టెప్స్ ఫాలో అవ్వండి.
>> ముందుగా www.incometax.gov.in వెబ్‌సైట్‌కి వెళ్లండి. దీని తర్వాత, మీ పాన్, పాస్‌వర్డ్ ఉపయోగించి వెబ్‌సైట్‌కి లాగిన్ అవ్వండి.
>> ఇ-ఫైలింగ్ పోర్టల్‌లోకి లాగిన్ అయిన తర్వాత, 'ఇ-ఫైల్ ట్యాబ్'కి వెళ్లండి. అక్కడ 'వ్యూ ఫైల్డ్ రిటర్న్' ఆప్షన్‌ను ఎంచుకోండి. ఇక్కడ మీరు దాఖలు చేసిన అన్ని రిటర్న్‌ల వివరాలను చూస్తారు.
>> స్టేటస్ చూడటానికి మీరు 'వ్యూ ఫైల్డ్ రిటర్న్స్' ఎంపికపై క్లిక్ చేయాలి. దీని తర్వాత ITR ఫైల్ స్టేటస్ మీ స్క్రీన్‌పై కనిపించడం ప్రారంభమవుతుంది.
>> మీకు ఆదాయపు పన్ను శాఖ రీఫండ్ పంపినట్లయితే, మీరు దాని వివరాలను అక్కడ చూస్తారు. మీరు అక్కడ చెల్లింపు విధానం, రీఫండ్ మొత్తం, క్లియరెన్స్ తేదీ వంటి సమాచారాన్ని కూడా చూస్తారు.
>> ITR ఫైల్ చేస్తున్నప్పుడు, మీరు పన్ను శాఖకు ఇచ్చిన సమాచారం అంతా సరైనదేనని నిర్ధారించుకోవాలి, లేకుంటే మీ రీఫండ్ కూడా రద్దు కావచ్చు.
>> కొన్నిసార్లు, మీ రీఫండ్ క్లెయిమ్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంటుంది., ఫలితంగా రీఫండ్ మొత్తం మీ బ్యాంక్ ఖాతాలో జమ అవ్వదు.
>> ఇలా మీ రీఫండ్ తిరస్కరణకు గురైతే దానికి కారణం మీకు ఐటీ శాఖ తెలియజేస్తుంది. ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం, మీ బ్యాంక్ ఖాతా ముందుగా ఆథరైజ్డ్ కాకపోయినా, బ్యాంకు అకౌంట్ యాక్టీవ్ గా లేకపోయినా, మీ రీఫండ్ ప్రాసెస్ ముందుకు కదలదు. ఒక్కోసారి ఫెయిల్ అవుతుంది.
Also Read : National Pension Sceme: NPS పథకంలో వచ్చిన మార్పులు ఇవే...ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు మీ కోసం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter