Top 22 Small Cap Mutual funds: 3 ఏళ్లలో అధిక లాభాలిచ్చే టాప్ 22 మ్యూచ్యువల్ ఫండ్స్ ఇవే

Top 22 Small Cap Mutual funds: చేతిలో డబ్బు ఉంటే ఇన్వెస్ట్‌మెంట్ కోసం చాలా మార్గాలుంటాయి. కొన్ని హై రిటర్న్స్ అందిస్తాయి కానీ రిస్క్ కూడా ఎక్కువే ఉంటాయి. షేర్ మార్కెట్, మ్యూచ్యువల్ ఫండ్స్ ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 13, 2024, 09:15 PM IST
Top 22 Small Cap Mutual funds: 3 ఏళ్లలో  అధిక లాభాలిచ్చే టాప్ 22 మ్యూచ్యువల్ ఫండ్స్ ఇవే

Top 22 Small Cap Mutual funds: ఇన్వెస్ట్‌మెంట్ ప్లానింగ్ చేసేవారికి మ్యూచ్యువల్ ఫండ్స్ మంచి ప్రత్యామ్నాయం కాగలదు. దీనికోసం కొన్ని మ్యూచ్యువల్ ఫండ్స్  మీ కోసం అందిస్తున్నాం. తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో అధిక లాభాలు ఆర్జించవచ్చు. అలాంటి టాప్ 22 స్మాల్ క్యాప్ మ్యూచ్యువల్ ఫండ్స్ గురించి తెలుసుకుందాం.

1. క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ గ్రోత్-కనీస ఎస్ఐపీ ఇన్వెస్ట్‌మెంట్ 1000 రూపాయలు కాగా 3 ఏళ్లకు 45.90 శాతం రిటర్న్స్ రావచ్చు.
2. నిప్పన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ గ్రోత్ ప్లాన్ కనీస పెట్టుబడి 100 రూపాయలు కాగా 3 ఏళ్లకు 37.83 శాతం రిటర్న్స్ లభిస్తాయి. 
3. హెచ్‌ఎస్‌బీసి స్మాల్ క్యాప్ ఫండ్ రెగ్యులర్ గ్రోత్ కనీస ఎస్ఐపీ పెట్టుబడి 500 రూపాయలు కాగా 3 ఏళ్లకు 36.51 శాతం లాభాలుండవచ్చు.
4. టాటా స్మాల్ క్యాప్ ఫండ్ రెగ్యులర్ ప్లాన్‌లో కనీసం ఎస్ఐపీ 100 రూపాయలు కాగా 3 ఏళ్లకు 33.37 శాతం రిటర్న్స్ ఆశించవచ్చు.
5.హెచ్‌డి‌ఎఫ్‌సి స్మాల్ క్యాప్ ఫండ్‌లో కనీసం ఎస్ఐపీ పెట్టుబడి 100 రూపాయలు కాగా 3 ఏళ్లకు 33.19 శాతం రిటర్న్స్ లభిస్తాయి.
6. కెనరా రెబెకో స్మాల్ క్యాప్ ఫండ్ రెగ్యులర్ ప్లాన్‌లో కనీసం ఎస్ఐపీ 1000 రూపాయలు కాగా 3 ఏళ్లకు 32.19 శాతం రిటర్న్స్ ఉంటాయి. 
7. ఫ్రాంక్లిన్ ఇండియా స్మాల్లర్ కంపెనీస్ ఫండ్‌లో కనీసం ఎస్ఐపీ పెట్టుబడి 500 రూపాయలు కాగా, 3 ఏళ్లకు 32.40 శాతం లాభాలు ఆర్జించవచ్చు.
8. బ్యాంక్ ఆఫ్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ రెగ్యులర్ ప్లాన్‌లో కనీసం ఎస్ఐపీ 1000 రూపాయలు కాగా 3 ఏళ్లకు 31.48 శాతం రిటర్న్స్ ఆశించవచ్చు.
9. సుందరం స్మాల్ క్యాప్ ఫండ్ రెగ్యులర్ ప్లాన్‌లో కనీసం ఎస్ఐపీ పెట్టుబడి 100 రూపాయలు కాగా, 3 ఏళ్లకు 31.20 శాతం లాభాలు ఆర్జించవచ్చు.
10. బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ రెగ్యులర్ ప్లాన్‌లో కనీసం ఎస్ఐపీ పెట్టుబడి 100 రూపాయలు కాగా 3 ఏళ్లకు 30.83 శాతం రిటర్న్స్ పొందవచ్చు.

ఇక ఇవి కాకుండా ఎల్ఐసీ ఎంఎఫ్ స్మాల్ క్యాప్ ఫండ్ రెగ్యులర్, ఎడెల్వీస్ స్మాల్ క్యాప్ ఫండ్ రెగ్యులర్ ప్లాన్, ఇన్వెస్కో ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ రెగ్యులర్ ప్లాన్, డీఎస్పీ స్మాల్ క్యాప్ ఫండ్ రెగ్యులర్ ప్లాన్, ఐసీఐసీఐ ప్రూడెన్షియల్ స్మాల్ క్యాప్ ఫండ్, యూనియన్ స్మాల్ క్యాప్ ఫండ్ రెగ్యులర్ ప్లాన్, యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్ రెగ్యులర్ ప్లాన్, యూటీఐ స్మాల్ క్యాప్ ఫండ్ రెగ్యులర్ ప్లాన్, కోటక్ స్మాల్ క్యాప్ ఫండ్, ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్ రెగ్యులర్ ప్లాన్, ఐటీఐ స్మాల్ క్యాప్ ఫండ్ రెగ్యులర్ ప్లాన్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ స్మాల్ క్యాప్ ఫండ్ ప్లాన్స్ ఉన్నాయి. 

Also read: AP Rajyasabha Elections 2024: తొలిసారి పెద్దల సభలో ప్రాతినిధ్యం కోల్పోతున్న తెలుగుదేశం పార్టీ

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News