Demat Account: షేర్ ట్రేడింగ్ చేస్తున్నారా, మీ డీమ్యాట్ ఎక్కౌంట్‌లో మోసం జరిగే ప్రమాదముంది

Demat Account: షేర్ మార్కెట్‌లో వ్యాపారం చేయాలంటే డీమ్యాట్ ఎక్కౌంట్ తప్పనిసరి. అయితే ఇప్పుడు డీమ్యాట్ ఎక్కౌంట్‌లో కూడా మోసం పొంచి ఉంది తస్మాత్ జాగ్రత్త అంటున్నారు మార్కెట్ నిపుణులు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 1, 2022, 04:14 PM IST
Demat Account: షేర్ ట్రేడింగ్ చేస్తున్నారా, మీ డీమ్యాట్ ఎక్కౌంట్‌లో మోసం జరిగే ప్రమాదముంది

షేర్ మార్కెట్ పెట్టుబడులతో వ్యాపారం చేసేందుకు కావల్సింది డీమ్యాట్ ఎక్కౌంట్. డీమ్యాట్ ఎక్కౌంట్ ద్వారా షేర్లను చాలా సులభంగా బదిలీ చేయవచ్చు. అదే సమయంలో ట్రాకింగ్ కూడా చేసుకోవచ్చు

షేర్ మార్కెట్‌లో తరచూ షేర్ల క్రయ విక్రయాలు జరుగుతుంటాయి. ఈ షేర్ల వివరాలు మీరు తెరిచే డీమ్యాట్ ఎక్కౌంట్‌లో ఉంటాయి. డీమ్యాట్ ఎక్కౌంట్‌లో దీర్ఘకాలం కొనసాగించినప్పుడు..అందులో నిధులు కూడా యాడ్ చేయవచ్చు. డీమ్యాట్ ఎక్కౌంట్‌లో షేర్లతో పాటు డబ్బులు కూడా యాడ్ చేసే వీలుంది. డీమ్యాట్ ఎక్కౌంట్ ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ముప్పు కచ్చితంగా పొంచి ఉంది. మీ ఎక్కౌంట్‌లో మోసం జరిగే అవకాశాలు లేకపోలేదు. అయితే కొన్ని విషయాల్ని దృష్టిలో ఉంచుకోవాలి.

డీమ్యాట్ ఎక్కౌంట్ ప్రయోజనాలు

డీమ్యాట్ ఎక్కౌంట్‌తో వ్యాపారం చేసేటప్పుడు ఆ ఎక్కౌంట్ ప్రయోజనాలు కూడా తెలసుకోవాలి. డీమ్యాట్ ఎక్కౌంట్ ద్వారా సులభంగా షేర్ల బదిలీ జరుగుతుంది. అటు ట్రెండింగ్ యాక్టివిటీని ట్రాక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా..ఆల్ టైమ్ యాక్సెస్ ఉంటుంది. దాంతోపాటు ఇందులో ఆటోమేటిక్‌గా బోనస్ స్టాక్, రైట్ ఇష్యూ, స్ప్లిట్ షేర్ క్రెడిట్ సౌకర్యాలుంటాయి.

డీమ్యాట్ ఎక్కౌంట్ ఫ్రాడ్ నుంచి ఎలా రక్షణ

డీమ్యాట్ ఎక్కౌంట్ హ్యాకింగ్ లేదా మోసానికి గురి కాకుండా ఉండాలంటే పాస్‌వర్డ్ స్ట్రాంగ్‌గా ఉండాలి. ఎక్కడా రాసుకోకూడదు. గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా తరచూ మారుస్తుండాలి.

ఎక్కౌంట్ స్టేట్‌మెంట్ పరిశీలన

మీ ఫోన్ నెంబర్, ఈ మెయిల్ ఐడీ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉంచుకోవాలి. డిపాజిటరీ ద్వారా మీకు పంపించిన అన్ని స్టేట్‌మెంట్లు, ఎస్ఎంఎస్‌లు పూర్తిగా పరిశీలించాలి. డీమ్యాట్ ఎక్కౌంట్ లావాదేవీలు, మీ ట్రెండింగ్ యాక్టివిటీలతో సరిపోల్చుకోవాలి. ఏ మాత్రం తేడా కన్పించినా ఫిర్యాదు చేయాలి.

Also read: EPFO Interest Credit: ఈపీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. మీ ఖాతాను చెక్ చేసుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

EPFOUANPF InterestPF BalanceHow to check pf balance

Trending News