Hyundai Creta Purchase just @ RS 8 Lakh: భారత మార్కెట్‌లో 'హ్యుందాయ్ క్రెటా' మంచి ప్రజాదరణ పొందిన ఎస్‌యూవీ. అంతేకాదు కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్ మెయిల్ లీడర్ కూడా. ప్రస్తుతం మార్కెట్‌లో కొత్త క్రెటాకు ఫుల్ డిమాండ్ ఉంది. అలాగే పాత హ్యుందాయ్ క్రెటాకు కూడా మంచి డిమాండ్ ఉంది. సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్‌లో క్రెటాకు భారీ డిమాండ్ ఉంది. మీరు కూడా పాత హ్యుందాయ్ క్రెటాను కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే.. మంచి కండిషన్ ఉన్న కార్స్ ఉన్నాయి.
కార్స్24 వెబ్‌సైట్‌లో సెకండ్ హ్యాండ్ హ్యుందాయ్ క్రెటా కార్లు చాలానే ఉన్నాయి. ఈ కార్ల ఖరీదు దాదాపు 8 లక్షల రూపాయలు. సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. అందులో ముఖ్యమైనది రోడ్ టాక్స్. మీరు రోడ్ టాక్స్ (రహదారి పన్ను) చెల్లించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ కారు కొన్నప్పుడే మొదటి యజమాని రోడ్ టాక్స్ చెల్లిస్తాడు. ప్రస్తుతం కార్స్24 వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న వాటిని చూద్దాం.
2015 Hyundai Creta 1.6 SX (O) CRDI MANUAL:
2015 హ్యుందాయ్ క్రెటా 1.6 SX (O) CRDI మాన్యువల్ కారు మొత్తంగా 56,461 కిమీలు తిరిగింది. ఈ కారు ధర కార్స్24 వెబ్‌సైట్‌లో రూ.7,65,000లుగా ఉంది. డీజిల్ ఇంజన్ ఉన్న ఈ కారు.. మొదటి యజమాని వద్ద ఉంది. దీని సంఖ్య DL-8C నుంచి ప్రారంభమవుతుంది. ఢిల్లీలో ఈ కారు అమ్మకానికి ఉంది.
Also Read: మార్కెట్‌లో అలజడి సృష్టించడానికి వచ్చిన లావా బ్లేజ్ 2.. డిజైన్, ఫీచర్స్ అదుర్స్! 10వేల కంటే తక్కువ
2015 Hyundai Creta 1.6 S MANUAL:
2015 హ్యుందాయ్ క్రెటా 1.6 S మాన్యువల్ రీడింగ్ 28,025 కిమీలు. ఈ కారు ధర రూ.7,91,000. ఇందులో పెట్రోల్ ఇంజన్ ఉండగా.. మొదటి యజమాని వద్ద ఉంది. ఈ కారూ నంబర్ ప్లేట్ UP-32 నుండి ప్రారంభమవుతుంది. ఢిల్లీలో ఇది అమ్మకానికి అందుబాటులో ఉంది.
2016 Hyundai Creta 1.6 S MANUAL:
2016 హ్యుందాయ్ క్రెటా 1.6 S మాన్యువల్ రీడింగ్ 65,531 కిమీలు. కార్స్24 వెబ్‌సైట్‌లో ఈ కారు ధర రూ.8,18,000. ఇందులో పెట్రోల్ ఇంజన్ ఉండగా..మొదటి యజమాని వద్ద ఉంది. ఈ కారు సంఖ్య DL-7Cతో ప్రారంభమవుతుంది. ఢిల్లీలో ఈ కారు అమ్మకానికి అందుబాటులో ఉంది.
2017 Hyundai Creta 1.4 S PLUS MANUAL:
2017 హ్యుందాయ్ క్రెటా 1.4 ఎస్ ప్లస్ మాన్యువల్ రీడింగ్ 58,830 కిమీ. ఈ కారు ధర రూ.8,59,000లుగా ఉంది. ఈ కారులో డీజీల్ ఇంజిన్ ఉండగా.. ప్రస్తుతం మొదటి యజమాని వద్ద ఉంది. ఈ కారు సంఖ్య DL-1Cతో ప్రారంభమవుతుంది. ఇది ఢిల్లీలో మాత్రమే అమ్మకానికి అందుబాటులో ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి