SBI Latest News: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India) తన ఖాతాదారులను అలర్ట్ చేసింది. ఇప్పుడు ఖాతాదారులు తమ ఇంటి వద్ద నుంచే ఎస్‌బీఐ ఏటీఎం కమ్ క్రెడిట్ కార్డ్ గ్రీన్ పిన్ జనరేట్ చేసుకోవచ్చునని తెలిపింది. ఈ ప్రయోజనాల కోసం ఖాతాదారులుల బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదని పేర్కొంది.
గ్రీన్ పిన్ కావాలనుకునే వినియోగదారులు ఎస్‌బీఐ(SBI) డెబిట్ కమ్ ఏటీఎం కార్డ్ పిన్‌ను ఐవీఆర్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఎస్ఎంఎస్ ద్వారా జనరేట్ చేసుకకోవచ్చు. ‘మా టోల్ ఫ్రీ ఐవిఆర్ సిస్టమ్ ద్వారా మీ డెబిట్ కార్డ్ పిన్ లేదా గ్రీన్ పిన్‌ను క్రియేట్ చేసుకోవడానికి తేలికైన పద్ధతులు ఇక్కడ ఉన్నాయి. 1800 112 211 లేదా 1800 425 3800 కు కాల్ చేయండి’ అని ఎస్‌బీఐ ట్వీట్ చేసింది.
Also Read: SBI Personal Loan: ఒక్క ఎస్ఎంఎస్ లేదా Missed Call ద్వారా ఎస్‌బీఐ పర్సనల్ లోన్ పొందవచ్చు
IVR ద్వారా SBI ట్రాన్సాక్షన్ పిన్‌ను జనరేట్ చేసుకోవడానికి మీరు పైన పేర్కొన్న నంబర్లకు కాల్ చేయాలి. ఆ తరువాత కింద పేర్కొన్న విధంగా చేయాల్సి ఉంటుంది.
స్టెప్ 1: కాల్ చేసిన తరువాత PIN జనరేట్ చేసుకునేందుకు ఆప్షన్ 6 ఎంచుకోవాలి
స్టెప్ 2: ఎస్‌బీఐ కార్డు మీద ఉన్న నెంబర్, పుట్టిన తేదీ, Card Expiry Date ఎంటర్ చేయాలి.
స్టెప్ 3: రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు లేదా మెయిల్ ఐడీకి 6 అంకెల ఓటీపీ వస్తుంది
స్టెప్ 4: నాలుగు అంకెలు ఉండే PIN number ఎంచుకోవాలి, దాన్ని రీ కన్ఫామ్ చేసేందుకు మరోసారి టైప్ చేయాలి
స్టెప్ 5: ఆ తరువాత IVRలో మీ పిన్ జనరేట్ అయిందని నిర్దారణ మెస్సేజ్ వస్తుంది.
Also Read: EPFO Alert: ఈపీఎఫ్ వడ్డీ రావాలంటే 40 లక్షల మంది ఖాతాదారులు ఇలా చేస్తే సరి
IVR ద్వారా మీ యాడ్-ఆన్ కార్డ్ ట్రాన్సాక్షన్లకు PINను క్రియేట్ చేసుకునేందుకు ఈ దశలను పాటించండి:
స్టెప్ 1: SBI Add-on Card మీద ఉన్న 16 అంకెలు టైప్ చేయాలి మరియు పుట్టిన తేదీ, Add-on Card Expiry Date ఎంటర్ చేయాలి
స్టెప్ 2: పిన్ క్రియేట్ చేసుకునేందుకు ఆప్షన్ 6ను ఎంపిక చేసుకోండి
స్టెప్ 3: రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్‌కు లేదా ఈమెయిల్ ఐడీకి 6 అంకెల ఓటీపీ వస్తుంది
స్టెప్ 4: నాలుగు అంకెలు ఉండే PIN number ఎంచుకోవాలి, దాన్ని రీ కన్ఫామ్ చేసేందుకు మరోసారి టైప్ చేయాలి
స్టెప్ 5: ఆ తరువాత IVRలో మీ పిన్ జనరేట్ అయిందని నిర్దారణ మెస్సేజ్ వస్తుంది.
Also Read: Post Office ఈ మంత్లీ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయండి, ఇక ప్రతినెలా రూ.4,950 పొందండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook