SBI: దేశీయ అతి పెద్ద బ్యాంక్ ఎస్బీఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) మరో కీలక నిర్ణయం తీసుకుంది. బేస్ రేటును పెంచుతున్నట్లు (SBI Base rate hike) తాజాగా ప్రకటించింది. బేస్ రేటు 0.10 శాతం (10 బేసిస్ పాయింట్లు) పెంచుతున్నట్లు తెలిపింది. దీనితో కనీస వడ్డీ రేటు 7.55 శాతానికి (SBI Base rate now) పెరిగింది. దీనితో పాటు ప్రైమ్ లెంటింగ్ రేటు 12.30 శాతానికి చేరింది. పెరిగిన బేస్ రేట్ డిసెంబర్ 15 నుంచే అమలు చేస్తున్నట్లు తెలిపింది.
మార్జినల్ కాస్ట్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్)లో మాత్రం ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది ఎస్బీఐ.
ఏమిటి ఈ బేస్ రేటు?
బ్యాంకులు ఇచ్చే రుణాలకు ఆర్బీఐ బేస్ రేటును (What is Base rate) నిర్ణయిస్తుంది. పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు ఈ బేస్ రేటులో మార్పు చేస్తుంది. ఈ రేటు కన్నా తక్కువకు రుణాలు ఇచ్చేఅనుమతి బ్యాంకులకు ఉండదు.
రుణ గ్రహీతలపై ప్రభావం..
బేస్ రేటు పెరిగిన కారణంగా ఆ ప్రభావం బ్యాంకింగ్ వినియోగదారులపై.. ముఖ్యంగా రుణ గ్రహీతలపై అధికంగా ఉండే అవకాశముంది. ఎందుకంటే.. తక్కువ వడ్డీకి రుణాలు చేయాలనుకున్నా.. ఆర్బీఐ పరిమితులకు లోబడి మాత్రమే బ్యాంకులు వడ్డీ రేటుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
ఎంసీఎల్ఆర్ అంటే?
బేస్ రేటు ఆధారంగానే కాకుండా బ్యాంకులు రుణాలకు వడ్డీ నిర్ణయించేందుకు మార్జినల్ కాస్ట్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్)ను కూడా ఉపయోగించుకోవచ్చు. ఎంసీఎల్ఆర్ ఆధారంగా నిర్ణయించే వడ్డీ రేటుకు రుణాలు తీసుకోవడం ద్వారా.. ఆర్బీఐ రెపో రేటులో చేసే మార్పులకు తగ్గట్లుగా.. రిటైల్ రుణాగ్రహితల వడ్డీలోను మార్పు ఉంటుంది.
సాధారణంగా ప్రతి రెండు నెలలకు ఓ సారి రెపో, రివర్స్ రెపో రేట్లను సవరిస్తుంది ఆర్బీఐ.
Also read: Gold Price today: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు, వివిధ నగరాల్లో ఇవాళ్టి ధరలు
Also read: Budget smartphones: రూ.10 వేలలోపే అదిరే స్మార్ట్ఫోన్లు- ఫీచర్లు ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
SBI: ఎస్బీఐ రుణాలు మరింత భారం- బేస్ రేటు 10 బేసిస్ పాయింట్లు పెంపు!
రుణ గ్రహీతలకు ఎస్బీఐ షాక్
బేస్ రేటు 10 బేసిస్ పాయింట్లు పెంపు
పెరిగిన వడ్డీ రేటు ఈ నెల 15 నుంచే వర్తింపు