SBI: ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. లోన్ కస్టమర్లకు షాక్ తప్పదా.. వడ్డీ రేటు పెరిగే ఛాన్స్?

SBI MCLR Hike: మార్జినల్ లెండింగ్ రేటు (MCLR)ను 10 బేసిస్ పాయింట్స్ పెంచుతూ ఎస్‌బీఐ నిర్ణయం తీసుకుంది. దీని ఎఫెక్ట్ రుణ గ్రహీతలపై పడే అవకాశం ఉంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 18, 2022, 02:30 PM IST
  • ఎస్‌బీఐ లోన్ కస్టమర్లకు షాక్
  • ఎంసీఎల్ఆర్‌ 10 బేసిస్ పాయింట్లు పెంపు
  • రుణాలపై వడ్డీ రేట్లు పెరిగే అవకాశం
SBI: ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. లోన్ కస్టమర్లకు షాక్ తప్పదా.. వడ్డీ రేటు పెరిగే ఛాన్స్?

SBI MCLR Hike: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. మార్జినల్ లెండింగ్ రేటు (MCLR)ను 10 బేసిస్ పాయింట్స్ పెంచింది. అన్ని రకాల టెన్యూర్స్‌కి ఇది వర్తిస్తుంది. ఏప్రిల్ 15 నుంచే ఈ నిర్ణయం అమలులోకి వచ్చినట్లు ఎస్‌బీఐ వెల్లడించింది. ఎస్‌బీఐ తాజా నిర్ణయంతో రుణాలపై వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉంది. అలాగే గృహ రుణాలు, వాహన రుణాలు, ఇతరత్ర రుణాలు చెల్లించేవారిపై ఈఎంఐ భారం మరింత పెరగవచ్చు.

ఎంసీఎల్‌ఆర్ పెంపు వివరాలు :

1) ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ 6.65 శాతం నుంచి 6.75 శాతానికి పెంపు
2) ఒక నెల టెన్యూర్‌పై ఎంసీఎల్ఆర్ 6.65 నుంచి 6.75 శాతానికి పెంపు
3) 3 నెలల టెన్యూర్‌పై ఎంసీఎల్ఆర్ 6.65 శాతం నుంచి 6.75 శాతానికి పెంపు
4)6 నెలల టెన్యూర్‌పై ఎంసీఎల్ఆర్ 6.95 శాతం నుంచి 7.05 శాతానికి పెంపు
5)ఒక ఏడాది కాలానికి ఎంసీఎల్ఆర్ 7 శాతం నుంచి 7.10 శాతానికి పెంపు
6)రెండేళ్ల కాల పరిమితికి ఎంసీఎల్ఆర్ 7.2 శాతం నుంచి 7.3 శాతానికి పెంపు
7)మూడేళ్ల కాల పరిమితిపై ఎంసీఎల్ఆర్ 7.3 శాతం నుంచి 7.4 శాతానికి పెంపు 

ఎస్‌బీఐ రుణ గ్రహీతలపై ఎఫెక్ట్ :

సాధారణంగా బ్యాంకులు ఎంసీఎల్ఆర్ ఆధారంగానే రుణాలపై వడ్డీ రేట్లు నిర్ణయిస్తాయి. రెపో రేటు, లెండింగ్ రేట్ల ఆధారంగా ప్రతీ నెలా ఎంసీఎల్ఆర్‌లో సవరణలు జరగుతాయి. ఎంసీఎల్‌ఆర్ కన్నా తక్కువ రేటుతో బ్యాంకులు రుణాలు ఇవ్వడం కుదరదు. అయితే ఆ బ్యాంకులో పనిచేసే ఉద్యోగులు, డిపాజిట్లపై మాత్రం దీనికి మినహాయింపు ఉంటుంది. తాజా ఎంసీఎల్ఆర్ పెంపుతో... ఎస్‌బీఐ నుంచి రుణాలు పొందే కస్టమర్లపై వడ్డీ రేట్ల రూపంలో ఆ ఎఫెక్ట్ పడవచ్చు. అలాగే ఇప్పటికే రుణాలు పొందినవారిపై ఈఎంఐ రూపంలో మరింత భారం తప్పకపోవచ్చు.

Also Read: Railway Ticket at Post offices: త్వరలో పోస్టాఫీసుల్లో రైల్వే టికెట్ బుకింగ్

Also Read:  Telangana Job Notifications: నిరుద్యోగులకు మంత్రి హరీశ్ రావు గుడ్ న్యూస్... వారం రోజుల్లో పోలీస్ రిక్రూట్‌మెంట్  నోటిఫికేషన్ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News