SBI Card Alert: ఎస్​బీఐ కార్డ్​ యూజర్లకు షాక్​- ఈఎంఐ లావాదేవీలకు ఛార్జీల బాదుడు!

SBI crad EMI: ఈఎంఐలో వస్తువులను కొనుగోలు చేసే వారికి ఎస్​బీఐ కార్డ్స్ షాకిచ్చింది. త్వరలో ఈఎంఐ లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేయనున్నట్లు తెలిపింది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 13, 2021, 02:26 PM IST
  • క్రెడిట్​ కార్డ్ లావాదేవీలపై ఎస్​బీఐ కార్డ్స్​ కీలక ప్రకటన
  • ఈఎంఐలో కొనుగోళ్లపై ప్రాసెసింగ్ ఫీజుల వసూలుకు నిర్ణయం
  • డిసెంబర్​ 1 నుంచి అమలులోకి రానున్న కొత్త రూల్స్​
SBI Card Alert: ఎస్​బీఐ కార్డ్​ యూజర్లకు షాక్​- ఈఎంఐ లావాదేవీలకు ఛార్జీల బాదుడు!

SBI credit cards EMIs would be subject to a processing fee as well as tax: మీరు ఎస్​బీఐ క్రెడిట్ కార్డు వాడుతున్నారా? అయితే మీకో షాకింగ్ న్యూస్​. ఎస్​బీఐ క్రెడిట్​ కార్డ్​పై ఈఎంఐలు ఇకపై మరింత భారం కానున్నాయి. ఈఎంఐ లావాదేవీలపై ప్రాసెంసింగ్ ఛార్జీలు వసూలు చేయనున్నట్లు ఎస్​బీఐ కార్డ్స్​ అండ్ పేమెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్​ (SBICPSL) తాజాగా ప్రకటించింది.

కొత్త ఛార్జీల పూర్తి వివరాలు..

ఈఎంఐ లావాదేవీలపై రూ.99 ప్రాసెసింగ్ ఫీజు కింద వసూలు చేయనున్నట్లు ఎస్​బీఐ ప్రకటించింది. దీనికి అదనంగా ట్యాక్సులు కూడా వర్తించనున్నాయని తెలిపింది.

ఈ కొత్త ఛార్జీలు వచ్చే నెల (డిసెంబర్ 1) నుంచే అమలులోకి రానున్నాయి పేర్కొంది ఎస్​బీఐ కార్డ్స్​.

Also read: 10 digit Mobile Number: అవును.. ఫోన్ నంబర్ 10 అంకెలు మాత్రమే ఎందుకు ఉంటుంది..? పదండి తెలుసుకుందాం

అన్నింటికీ ఛార్జీల వర్తింపు..

ఎస్​బీఐ తీసుకున్న తాజా నిర్ణయంతో.. డిసెంబర్ 1 నుంచి జరిపే ఈఎంఐ లావాదేవీలపై ఛార్జీలు వర్తించనున్నాయి.

ఈ-కామర్స్ వెబ్​సైట్లతో పాటు.. ఆఫ్​లైన్​లో ఈఎంఐ ఆప్షన్​తో చేసే కొనుగోళ్లన్నింటికి ఈ ఛార్జీలు వర్తిస్తాయన్నమాట. ఇంతకు ముందు ఇలాంటి ఛార్జీలు ముందు కొనుగోలు చేసి.. తర్వాత ఈఎంఐకి కన్వర్షన్ చేసుకున్నప్పుడు మాత్రమే వర్తించేవి.

ఒక వేళ ఈఎంఐ రద్దయితే ఆ ఛార్జీలను రీఫండ్ చేయనున్నట్లు ఎస్​బీఐ పేర్కొంది.

Also read: Tips For reduce Expenses: ఈ టిప్స్​తో అనవసర ఖర్చులకు చెక్ పెట్టండి!

Also read: Rakesh Jhunjhunwala: ఆకాశ ఎయిర్​ నుంచి బోయింగ్​కు రూ.75 వేల కోట్ల ఆర్డర్​?

ఈఎంఐ మొత్తంతో సంబంధం లేదు..

అయితే ఈఎంఐ మొత్తానికి ప్రాసెసింగ్​ ఫీజుకు సంబంధం లేదని ఎస్​బీఐ కార్డ్స్​ స్పష్టతనిచ్చింది. అంటే.. మీరు కొనే వస్తువుపై ఈఎంఐ ఎంత తక్కువగా ఉన్నా.. ఎంత ఎక్కువగా ఉన్నా దానిపై ప్రాసెసింగ్ ఫీజు రూ.99స(పన్నులు అదనం) మాత్రమే వసూలు చేయనున్నట్లు పేర్కొంది.

పండుగల వంటి సమయాల్లో జీరో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని ఇస్తుంటారు. అయితే ఆ ఆఫర్లు ఉన్నా.. ఛార్జీలు తప్పనిసరి అని వివరించింది ఎస్​బీఐ కార్డ్స్.

Also read: PNB reduces interest rates: పీఎన్​బీ ఖాతాదారులకు షాక్​- సేవింగ్స్ ఖాతాల వడ్డీకి కోత

Also read: Equity Mutual Funds: ఈక్విటీ మార్కెట్‌లో పురోగతి, భారీగా పెట్టుబడులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News