Saving Plan Tips: నెలకు వేయి రూపాయలే..మెచ్యురిటీ పూర్తయితే 2 కోట్లు, ఎలాగంటే

Saving Plan Tips: నెలకు వేయి రూపాయలు..మెచ్యూరిటీ పూర్తయితే..ఏకంగా 2 కోట్ల రూపాయలు. ఆశ్చర్యంగా ఉందా..ఎస్ఐపీ ప్లాన్స్‌తో ఇది సాధ్యమే అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. ఆ ప్లాన్స్ వివరాలు మీ కోసం.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 13, 2022, 11:13 PM IST
Saving Plan Tips: నెలకు వేయి రూపాయలే..మెచ్యురిటీ పూర్తయితే 2 కోట్లు, ఎలాగంటే

Saving Plan Tips: నెలకు వేయి రూపాయలు..మెచ్యూరిటీ పూర్తయితే..ఏకంగా 2 కోట్ల రూపాయలు. ఆశ్చర్యంగా ఉందా..ఎస్ఐపీ ప్లాన్స్‌తో ఇది సాధ్యమే అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. ఆ ప్లాన్స్ వివరాలు మీ కోసం.

ఆధునిక పోటీ ప్రపంచంలో..రోజువారీ ఖర్చులతో పాటు భవిష్యత్ కోసం కూడా ప్లానింగ్ అవసరమౌతుంటుంది. అందుకే సురక్షితమైన పెట్టుబడులు తప్పనిసరి. పెట్టుబడులకు ఓ పరిమితి గానీ, ఓ సమయం గానీ ఉండదు. ఎప్పుడైనా ఎవరైనా ఎంతైనా పెట్టవచ్చు. మీ ఆదాయంలోని ఓ భాగాన్ని కచ్చితంగా పెట్టుబడుల్లో పెడితే భవిష్యత్తులో మంచి లాభాలుంటాయి.

పొదుపు కోసం మనకు చాలా విధానాలున్నాయి. కానీ కొన్నింటిలో డబ్బులు పెట్టుబడి పెట్టడం మంచి పద్ధతి. ఇప్పటివరకూ మీరు ఎక్కడా పెట్టుబడులు పెట్టకపోతే..ఇక ఆలస్యం చేయవద్దు. తక్కువ బడ్జెట్‌లోనే మంచి ఫండింగ్ ఎలా సిద్ధం చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. దీనికోసమే ఎస్ఐపీ. స్మాల్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్. ప్రతి నెల తక్కువ మొత్తంలో పొదుపు చేస్తూ..భారీగా నిధులు కూడగట్టాలంటే ఎస్ఐపీ మీకు అద్భుతమైన విధానం. అందుకే మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడులు పెట్టడం వల్ల మీకు దీర్ఘకాలిక లాభం కలుగుతుంది. దాంతోపాటు ఇందులో ప్రతి నెలా పెట్టుబడి పెట్టే సౌకర్యముంటుంది. అందుకే చిన్న మొత్తం పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలుంటాయి.

నెలకు వేయి రూపాయలతో కోటీశ్వరుడు 

చిన్న చిన్నపెట్టుబడులతో భారీగా నిధులు జమ చేసేందుకు మీరు ప్రారంభంలో నెలకు వేయి రూపాయల్నించి ప్రారంభించండి. అంటే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడితే ప్రయోజనకరం. మీరు కూడా నెలకు వేయి రూపాయలు పెట్టుబడి పెడుతూ.కోటీశ్వరుడిగా మారవచ్చు.

దీనికోసం ప్రతినెలా వేయి రూపాయలు పెట్టుబడిని మ్యూచువల్ ఫండ్‌లో పెట్టాల్సి ఉంటుంది. గత కొన్నేళ్లుగా మ్యూచువల్ ఫండ్‌లో 20 శాతం కంటే ఎక్కువే రిటర్న్ వస్తోంది. అంటే మీరు ఈ డబ్బుల్ని 20 ఏళ్లు పెట్టుబడిగా పెడితే..మొత్తం 2.4 లక్షలు జమ అవుతాయి. 20 ఏళ్లలో ఏడాదికి 15 శాతం రిటర్న్ లెక్కేసుకుంటే 15 లక్షల 16 వేల రూపాయలు లభిస్తాయి. అదే ఒకవేళ రిటర్న్ 20 శాతం లభిస్తే మొత్తం 31.61 లక్షలు వస్తుంది. ఒకవేళ మీరు ప్రతినెలా వేయి రూపాయల చొప్పున 25 ఏళ్ల వరకూ పెట్టుబడి పెడితే..దీనిపై మీకు 20 శాతం ఏడాదికి రిటర్న్ లభిస్తుంది. అంటే మెచ్యూరిటీ పూర్తయిన తరువాత 86.27 లక్షలు లభిస్తాయి. అదే విధంగా 30 ఏళ్లు పూర్తయితే..20 శాతం రిటర్న్ చొప్పున మీకు 2 కోట్ల 33 లక్షల 60 వేల రూపాయలు లభిస్తాయి.

Also read: EPF Account: మీ పీఎఫ్ ఎక్కౌంట్‌లో నామినీ ఫైల్ చేసారా..వెంటనే చేస్తే 7 లక్షల వరకూ లాభం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News