Petrol Prices Hikes: సామాన్యులపై పెట్రో మంట.. లీటర్‌ పెట్రోల్‌ @రూ.150

Petrol Prices may reach 150 per litre: రష్యా, ఉక్రెయిన్‌ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా భారత్‌లోని సామాన్య ప్రజలపై పెను భారం పడనుంది. లీటర్‌ పెట్రోల్‌ ధర ఏకంగా రూ.150కి చేరుకుంటుందని నిపుణులు అంటున్నారు.

Last Updated : Feb 25, 2022, 08:26 PM IST
  • సామాన్యుడిపై పెట్రో భారం
  • చాలా దేశాల్లో కొండెక్కి కూర్చున్న పెట్రోల్ ధరలు
  • లీటర్‌ పెట్రోల్‌ ధర ఏకంగా రూ.150
Petrol Prices Hikes: సామాన్యులపై పెట్రో మంట.. లీటర్‌ పెట్రోల్‌ @రూ.150

Petrol Prices may reach 150 per litre in India: రష్యా, ఉక్రెయిన్‌ మధ్య జరుగుతున్న యుద్ధం ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే ఎకానమీ పడిపోగా.. ఇప్పుడు ద్రవ్యోల్బణంపై కూడా ప్రభావం పడనుంది. రష్యా, ఉక్రెయిన్‌ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. దాంతో చాలా దేశాల్లో పెట్రోల్, డీజిల్‌ ధరలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. భారత్‌లో కూడా ఇందనపు ధరలు భారీ స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. 

ఐరోపా, ఆసియా దేశాలకు ముడి చమరును అధిక మొత్తంలో రష్యానే ఎగుమతి చేస్తుంటుంది. ఉక్రెయిన్‌తో నెలకొన్న రాజకీయ యుద్ధ వాతావరణాల నేపథ్యంతో అక్కడ సరఫరా లోపం ఏర్పడింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు ఒక్కసారిగా కొండెక్కాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర ఓ బ్యారెల్‌కు నెల రోజుల క్రితం 75 డాలర్లుగా ఉండగా.. అది ఇప్పుడు ఏకంగా 103 డాలర్లకు చేరింది. మొన్నటివరకు బ్యారెల్‌ ముడి చమురు ధర 94 డాలర్లుగా ఉన్న విషయం తెలిసిందే. అంటే ఒక్కసారిగా 10 డాలర్లు పెరిగింది. ఈ ఏడేళ్లలో ఇదే గరిష్ఠ స్థాయి పెరుగుదల. 

యుద్ధం అనివార్యం అని ప్రకటిస్తే.. రష్యాపై ఆంక్షలు మరింతగా విధిస్తారని విశ్లేషకులు అంటున్నారు. దాంతో సరఫరా తగ్గిపోవడంతో ఈ ఏడాది రెండో త్రైమాసికంలో బ్యారెల్‌ ధర 120 డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే భారత్‌లోని సామాన్య ప్రజలపై పెను భారం పడనుంది. లీటర్‌ పెట్రోల్‌ ధర ఏకంగా రూ.150కి చేరుకుంటుందని నిపుణులు అంటున్నారు. అయితే సర్‌ ఛార్జీలు, కస్టమ్స్‌ పన్నులను కేంద్రం తగ్గిస్తే మాత్రం కాస్త ఊరట లభించనుందట. 

దేశంలో పెట్రోలు ధరలు రాష్ట్రాలను బట్టి ఉన్నాయి. గతేడాదిలో కేంద్ర ప్రభుత్వం సర్‌ఛార్జీలు, కొన్ని పన్నులు తగ్గించడంతో లీటరుకు రూ.8-10 వరకు ధర తగ్గింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లీటరు పెట్రోల్ ధర 95లోపే ఉండగా.. కాంగ్రెస్‌, స్థానిక పార్టీలు ధరలు తగ్గించకపోవడంతో లీటరు పెట్రోలు 108 వరకు ఉంది. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగినా.. మన దగ్గర చమురు ధరలు స్థిరంగా ఉన్నాయి. అయితే ఎన్నికలు ముగియడం ఓ వైపు.. రష్యా, ఉక్రెయిన్‌ వివాదం మరోవైపు ఉండడంతో సామాన్యులపై పెట్రో మంట తప్పకపోవచ్చని అంచనా. 

Also Read: Radhe Shyam New Song: రాధేశ్యామ్‌ నుంచి మెలోడీ సాంగ్ విడుదల.. ఫిదా అవుతున్న ఫాన్స్!!

Also Read: Bheemla Nayak Review: భీమ్లా నాయ‌క్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 

Trending News