Jio AirFiber: వినాయక చవితి సందర్భంగా రిలయన్స్ జియో దేశంలో జియో ఎయిర్ ఫైబర్ సేవలు లాంచ్ చేసింది. ముందుగా 8 నగరాల్లో అందుబాటులో ఉంటుంది. ఢిల్లీ, ముంబై, చెన్నై, అహ్మదాబాద్, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా, పూణే నగరాల్లో అందుబాటులోకి వచ్చిన ఎయిర్ ఫైబర్ ప్యాకేజ్ వివరాలు ఇలా ఉన్నాయి..
ఎయిర్ ఫైబర్ జియో ద్వారా దేశంలోని 200 మిలియన్ల ఇళ్లను లక్ష్యంగా చేసుకుంది. జియో ఆప్టికల్ ఫైబర్ సదుపాయాలు దేశవ్యాప్తంగా 1.5 మిలియన్ కిలోమీటర్లకు విస్తరించి ఉన్నాయి. జియో ఫైబర్ పేరుకు తగ్గట్టే వైర్లు లేకుండా గాలి వేగంతో డేటా అందిస్తుంది. యూజర్లు ఈ డివైస్ ప్లగ్ ఆన్ చేసి వైఫై ద్వారా కనెక్ట్ కావచ్చు. ఇంట్లోనూ, ఆఫీసుల్లోనూ 1 జీబీపీఎస్ వరకూ కనెక్టివిటీ అందిస్తుంది. స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, స్మార్ట్ టీవీలు, సెటప్ బాక్స్‌లు అన్నీ స్పీడ్ ఏ మాత్రం తగ్గకుండా అమితమైన వేగంతో ఇంటర్నెట్ పొందవచ్చు.. జియో ఎయిర్ ఫైబర్ ప్లాన్ వివరాలు ఇలా ఉన్నాయి..
జియో ఎయిర్ ఫైబర్ ప్లాన్ 599 రూపాయలతో ప్రారంభమౌతుంది. దీని స్పీడ్ 30 ఎంబీపీఎస్ డేటాతో పాటు 550 డిజిటల్ ఛానెల్లు, 14 ఉచిత ఓటీటీ యాప్స్ వెసులుబాటు కలుగుతుంది. జియో ఎయిర్ ఫైబర్ ప్లాన్ గరిష్టంగా 1000 ఎంబీపీఎస్ స్పీడ్‌తో అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ ధర 3,999 రూపాయలుంటుంది. 550 డిజిటల్ ఛానెళ్లు, 14 ఓటీటీ యాప్స్ సబ్‌స్కిప్షన్స్ లభిస్తాయి. ఈ ప్లాన్స్ అన్నీ ఆరు నెలలు లేదా ఏడాదికి ఉంటాయి. జియో ఎయిర్ ఫైబర్ కనెక్షన్ కోసం వాట్సప్ ద్వారా 60008-60008 నెంబర్‌కు సంప్రదిస్తే సరిపోతుంది.
Also read: UIDAI Updates: ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్, మెయిల్ ఐడీలను ఇకపై స్వయంగా వెరిఫై చేసుకోవచ్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook