Reliance Jio: రిలయన్స్ జియో కస్టమర్స్‌కు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే రీఛార్జ్ ప్లాన్‌పై రూ.150 తగ్గింపు

Reliance Jio 666 Plan Discout: మీరు రిలయన్స్ జియో కస్టమర్సా.. అయితే పేటీఎం ద్వారా మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే భారీ తగ్గింపు పొందే అవకాశం ఉంది.

Written by - Srinivas Mittapalli | Last Updated : Aug 3, 2022, 08:38 AM IST
  • రిలయన్స్ జియో కస్టమర్స్‌కు బెస్ట్ ఆఫర్
  • పేటీఎంలో జియో రీఛార్జ్‌పై డిస్కౌంట్
  • రూ.150 వరకు ఆదా చేసుకునే అవకాశం
Reliance Jio: రిలయన్స్ జియో కస్టమర్స్‌కు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే రీఛార్జ్ ప్లాన్‌పై రూ.150 తగ్గింపు

Reliance Jio 666 Plan Discout: ప్రస్తుతం టెలికాం సంస్థలు రీఛార్జ్ ప్లాన్స్ ధరలను పెంచడమే కానీ తగ్గించట్లేదు. కొన్నిసార్లు నెల రోజుల వ్యవధిలోనే ధరలు మారిపోతున్నాయి. దీంతో డేటా ప్యాక్‌తో కూడిన రీఛార్జ్ ప్లాన్స్‌కి కస్టమర్స్ ఎక్కువ డబ్బులు వెచ్చించాల్సి వస్తోంది. అయితే కస్టమర్స్‌కి కాస్త ఊరటనిచ్చేలా పేటీఎం లాంటి డిజిటల్ పేమెంట్ యాప్స్ ప్రోమో కోడ్స్ ద్వారా రీఛార్జ్ ప్యాక్స్‌పై డిస్కౌంట్ అందిస్తున్నాయి. ప్రస్తుతం పేటీఎంలో రిలయన్స్ జియో రూ.666 ప్యాక్‌పై ఆకర్షణీయమైన డిస్కౌంట్ అందుబాటులో ఉంది.

పేటీఎం రీఛార్జ్ డిస్కౌంట్ ఎలా పొందాలంటే :

మీరు పేటీఎం ఉపయోగిస్తున్నట్లయితే.. మీ స్మార్ట్ ఫోన్‌లో ఆ యాప్ ఓపెన్ చేసి ప్రోమో కోడ్స్ లిస్ట్ చెక్ చేయండి. రిలయన్స్ జియో రూ.666 ప్రీపెయిడ్ ప్లాన్ డిస్కౌంట్‌కి సంబంధించి ప్రోమో కోడ్ అందుబాటులో ఉంటుంది. అయితే ఇది అందరికి అందుబాటులో ఉండకపోవచ్చు. ఎవరికైతే ఈ ప్రోమో కోడ్ కనిపిస్తుందో.. రీఛార్జ్ కోసం వారు దీన్ని ఉపయోగించుకోవచ్చు. తద్వారా రూ.150 వరకు తగ్గింపు లభిస్తుంది. అంటే.. రూ.666 విలువ చేసే రీఛార్జ్ ప్లాన్‌ని రూ.516కే పొందవచ్చు. ఇలా పేటీఎంతో రీఛార్జ్ చేసుకోవడం ద్వారా కస్టమర్స్‌కి రూ.150 వరకు ఆదా అవుతుంది.

రూ.666 ప్లాన్‌ వివరాలు :

రిలయన్స్ జియో అందిస్తున్న రూ.666 ప్లాన్‌తో కస్టమర్స్‌ రోజుకు 1.5 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ ఫోన్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు చేసుకునే వెసులుబాటు పొందుతారు. ఈ ప్లాన్ వాలిడిటీ 84 రోజులు ఉంటుంది. కాబట్టి 3 నెలల వరకు మళ్లీ రీఛార్జ్ చేయించాల్సిన పనిలేదు.

Also Read: Horoscope Today August 3rd: నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి ఇవాళ ఊహించని స్థాయిలో ధనలాభం..

Also Read; West Indies vs India: అదరగొట్టిన సూర్య కుమార్ యాదవ్.. విండీస్‌తో మూడో టీ20లో టీమిండియా విజయం

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News