Reliance Power: ఇటీవల రిలయన్స్ పవర్ కంపెనీ చేసిన స్టాక్ ఎక్స్ చేంజీలకు చేసిన ఫైలింగ్ లో రిలయన్స్ పవర్ ఇప్పుడు జీరో డెట్ కంపెనీగా అవతరించిందని పేర్కొంది. అంతేకాదు ప్రస్తుతం బ్యాంకుల నుంచి కానీ ఇతర ఆర్థిక సంస్థల నుంచి సంస్థకు ఎలాంటి అప్పులు లేవని తెలిపింది. గతంలో విదర్భ ఇండస్ట్రీస్ పవర్ లిమిటెడ్ పేరిట చేసిన అప్పులకు గ్యారెంటీర్ గా రిలయన్స్ పవర్ నిలిచింది. దీంతో ఆ కంపెనీని తమ అనుబంధ కంపెనీగా తెలుపుతూ వచ్చింది. అయితే ప్రస్తుతం ఈ రుణం సెటిల్ అవడంతో ఇకపై విదర్భ ఇండస్ట్రీస్ పవర్ లిమిటెడ్ తమ అనుబంధ సంస్థ కాదని ఫైలింగులో రిలయన్స్ పవర్ తెలిపింది.
రిలయన్స్ పవర్ సెప్టెంబర్ 17న తమ మాజీ అనుబంధ సంస్థ విదర్భ ఇండస్ట్రీస్ పవర్ లిమిటెడ్ (VIPL)కి చెందిన రూ. 3,872.04 కోట్ల భారీ రుణాన్ని సెటిల్ చేసినట్లు ప్రకటించింది. ఈ ప్రకటనతో ఒక్కసారిగా తర్వాత అడాగ్ కంపెనీ షేర్లలో భారీ పెరుగుదల కనిపించింది. సెప్టెంబర్ 18 ఉదయం 9:30 గంటలకు రిలయన్స్ పవర్ షేర్లు 5 శాతం పెరిగి రూ. 32.97 వద్ద ట్రేడయ్యాయి.
Also Read : Business Ideas: ఏడాది పొడవునా డిమాండ్ తగ్గని బిజినెస్.. ఒక్కసారి పెట్టుబడి పెడితే.. నెలకు లక్షల్లో ఆదాయం
ఆగస్టు 28, 2024న రిలయన్స్ పవర్ షేర్ ధర 52 వారాల గరిష్ట స్థాయి రూ. 38.11కి చేరుకుంది. అదే సమయంలో, రిలయన్స్ పవర్ షేర్లు సెప్టెంబర్ 17న BSEలో 1 శాతం పెరిగి రూ. 31.41 వద్ద లాభాల్లో ముగిశాయి. ఎక్స్‌ఛేంజ్ ఫైలింగ్ కు అందించిన సమాచారం ప్రకారం, RPower విదర్భ ఇండస్ట్రీస్ పవర్ లిమిటెడ్ ( VIPL) గత ఆర్థిక సంవత్సరంలో రూ. 3,086 కోట్ల రుణం ఉంది. ఈ భారీ రుణం సెటిల్ అవడంతో సెప్టెంబర్ 19 నుండి RPower అనుబంధ సంస్థ హోదా కోల్పోనుంది.
రిలయన్స్ పవర్ భారీ కాంట్రాక్టును పొందింది:
మరోవైపు రిలయన్స్ పవర్ లిమిటెడ్ పెద్ద ముందడుగు వేసింది. 500 MW/1,000 MWh బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (BESS) కాంట్రాక్టును గెలుచుకుంది. సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఇ-రివర్స్ వేలం (ERA)లో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SECI) నుండి భారీ ఆర్డర్‌ను గెలుచుకున్నట్లు తెలిపింది.
సోలార్ ఎనర్జీ రంగంలో జరిగిన అతిపెద్ద ఒప్పందాలలో ఇది ఒకటి , గంటకు 1,000 MW/2,000 MW కోసం BESS సింగిల్ యూనిట్ల కోసం ఆహ్వానించిన విస్తృత టెండర్‌ను రిలయన్స్ పవర్ దక్కించుకుంది. సెప్టెంబర్ 11న జరిగిన ఈ వేలంలో రిలయన్స్ పవర్ ఒక్కో మెగావాట్‌కు నెలకు రూ.3.819 లక్షల చొప్పున బిడ్ చేసింది. ఈ వేలంలో ఇతర బిడ్డర్లలో అవడా ఎనర్జీ, ఆక్మే క్లీన్‌టెక్, జెన్సోల్ , ఇండిగ్రిడ్ వంటి సంస్థలు ఉన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.