Redmi 12 5G Phone: తక్కువ ధరలో వస్తోన్న 256GB వేరియంట్ ఫోన్

Redmi 12 5G Phone Price, Features, Discount Offers: స్మార్ట్ ఫోన్స్ మేకింగ్ దిగ్గజం షావోమి సరికొత్తగా రెడ్‌మి 12 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఇండియాతో పాటు ఇంటర్నేషనల్ మార్కెట్లోనూ ఈ సిరీస్ ఒకేసారి లాంచ్ అయింది. రెడ్‌మి 12 సిరీస్‌లో రెండు స్మార్ట్ ఫోన్స్ లాంచ్ అయ్యాయి. అందులో ఒకటి రెడ్‌మి 12 5G కాగా మరొకటి రెడ్‌మి 12.

Written by - Pavan | Last Updated : Aug 1, 2023, 07:24 PM IST
Redmi 12 5G Phone: తక్కువ ధరలో వస్తోన్న 256GB వేరియంట్ ఫోన్

Redmi 12 5G Phone Price, Features, Discount Offers: స్మార్ట్ ఫోన్స్ మేకింగ్ దిగ్గజం షావోమి సరికొత్తగా రెడ్‌మి 12 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఇండియాతో పాటు ఇంటర్నేషనల్ మార్కెట్లోనూ ఈ సిరీస్ ఒకేసారి లాంచ్ అయింది. రెడ్‌మి 12 సిరీస్‌లో రెండు స్మార్ట్ ఫోన్స్ లాంచ్ అయ్యాయి. అందులో ఒకటి రెడ్‌మి 12 5G కాగా మరొకటి రెడ్‌మి 12. ఈ సిరీస్ చూడ్డానికి ఆకట్టుకునేలా క్రిస్టల్ గ్లాస్ బ్యాక్ డిజైన్, 6.79 FHD+ డిస్‌ప్లేతో తయారైంది. రెడ్‌మి ఇప్పటివరకు లాంచ్ చేసిన స్మార్ట్‌ఫోన్స్‌లో ఇదే అతిపెద్ద డిస్‌ప్లే కలిగి ఉండటం విశేషం. 90Hz రిఫ్రెష్ రేట్ స్క్రీన్‌ని అస్సలు హ్యంగ్ అవకుండా చేస్తుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంది. అంతేకాదు.. ఇండియాలో స్నాప్‌డ్రాగాన్ 4 Gen 2 5G ప్రాసెసర్‌తో వస్తోన్న మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్ కూడా ఇదే.

ఏయే కలర్లలో లభిస్తుందంటే..
రెడ్ మి 12 సిరీస్ ఫోన్ జేడ్ బ్లాక్, పాస్టెల్ బ్లూ, మూన్‌స్టోన్ సిల్వర్ ఇలా మూడు కలర్లలో లభిస్తోంది. 

రెడ్‌మి 12 సిరీస్‌లో ఏయే వేరియంట్ ఫోన్ ధరలు ఎలా ఉన్నాయంటే.. 
రెడ్‌మి 12 ఫోన్ మోడల్ :
రెడ్‌మి 12 4G వేరియంట్ రకం ఫోన్. 4GB RAM + 128GB వేరియంట్ ఫోన్ ఖరీదు రూ.8,999 కాగా 6GB RAM + 128GB వేరియంట్ ఫోన్ ధర రూ.10,499 కి లభిస్తుంది. ఆగస్ట్ 4 మధ్యాహ్నం 12 నుండి Mi.com , ఫ్లిప్‌కార్ట్ , ఎంఐ హోమ్ , ఎంఐ స్టూడియోలో అమ్మకాలకు అందుబాటులోకి వస్తుంది. అయితే, అది కేవలం 4G ఫోన్ మాత్రమే అనే విషయం గుర్తుంచుకోవాలి. 

ఆఫర్స్ వివరాలు ఎలా ఉన్నాయంటే..
ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డులు ఉపయోగించి ఈ ఫోన్ కొనే కస్టమర్స్ రూ. 1,000 ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ పొందొచ్చు. షావోమి ఫోన్ ఉన్న యూజర్స్ ఎక్స్ఛేంజ్ బోనస్‌ కింద 4GB వేరియంట్‌ ఫోన్‌పై  రూ. 1000 తగ్గింపు పొందవచ్చు. షావోమి , రెడ్‌మి ఫోన్ ఉన్న యూజర్స్‌కి 6GB RAM వేరియంట్ ఫోన్‌పై రూ. 1,000 అదనపు తగ్గింపు కూడా లభిస్తుంది.

రెడ్‌మి 12 5G ఫోన్ విషయానికొస్తే.. 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ఫోన్ ధర రూ.10,999 కాగా 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ఫోన్ రూ.12,499 గా ఉంది. అలాగే  8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ఫోన్ ఖరీదు 14,499 రూపాయలుగా ఉంది. ఇది మీకు Mi.com, అమేజాన్, ఎంఐ హోమ్ , ఎంఐ స్టూడియోలో ఆగస్టు 4వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి అందుబాటులోకి వస్తుంది. 

ఇది కూడా చదవండి : Mobile Phones Under 15000: రూ. 15,000 లోపు వచ్చే చీప్ అండ్ బెస్ట్ స్మార్ట్ ఫోన్స్

ఆఫర్స్ డీటేల్స్ ఏంటంటే..
రెడ్‌మి 12 5G 4GB RAM , 6GB RAM వేరియంట్‌ ఫోన్లపై ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డులు ఉపయోగించడం ద్వారా రూ. 1000 ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ లభిస్తుంది. షావోమి ఫోన్ ఉన్న వినియోగదారులకు రెడ్‌మి 12 5G 8GB RAM వేరియంట్ ఫోన్ కొనుగోలుపై 1000 రూపాయలు అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఇక ఈ రెండు ఫోన్లలో ఏ ఫోన్ కొనాలనుకున్నా.. మీరో మరో నాలుగు రోజులు ఆగక తప్పదు. 

ఇది కూడా చదవండి : 5G Phones Under Rs. 20K: రూ. 15 వేల నుంచి 20 వేల మధ్య చీప్ అండ్ బెస్ట్ 5G ఫోన్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News