RealMe Offer: రియల్ మీ జీటీ 2 ప్రో.. భారీ డిస్కౌంట్ ఆఫర్!

RealMe GT2 Pro sale in India: రియల్‌మీ ప్రియులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. భారత్‌లోని మొదటి సారిగా రియల్ మీ జీటీ 2 ప్రో వినియోగదారుల ముందుకు వచ్చింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 14, 2022, 02:06 PM IST
  • భారత్‌లో రియల్ మీ జీటీ 2 ప్రో
  • రూ. 18000 వరకు తగ్గింపు
  • అదిపోయే ఫిచర్లతలో రియల్ మీ జీటీ 2 ప్రో
RealMe Offer: రియల్ మీ జీటీ 2 ప్రో.. భారీ డిస్కౌంట్ ఆఫర్!

RealMe GT2 Pro Sale in India starts April 14: రియల్‌మీ ప్రియులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. భారత్‌లోని మొదటి సారిగా రియల్ మీ జీటీ 2 ప్రో వినియోగదారుల ముందుకు వచ్చింది. రియల్ మీ జీటీ 2 ప్రో (Realme GT 2 Pro) భారతదేశంలో మొదటిసారిగా ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి విక్రయానికి సిద్ధంగా ఉంది.  ఈ ఫోన్‌ ఇప్పటికే చైనాలో విడుదలైంది. అక్కడి వినియోగదారులు ఇప్పడికే రియల్‌ మీ జీటీ 2 ప్రోను వినియోగిస్తున్నారు. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర చైనాలో 3,899 (సుమారు రూ.46,700)గా ఉంది.  భారత్‌లో కూడా ఇప్పుడు ఈ ఫోన్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ మొబైల్ రేట్ల విషయానికొస్తే భారత్‌లో 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ. 49,999,  12GB + 256GB స్టోరేజ్ వేరియంట్‌కి రూ. 57,999 ఉంది. ప్రస్తతం ఫ్లిప్ కార్ట్, రియల్‌ మీ.కామ్‌లో అందబాటులో ఉన్నాయి.
 
హెడీఎఫ్‌సీ డిస్కౌంట్:
ఫ్లిప్ కార్ట్‌లో రియల్‌ మీ జీటీ 2 ప్రో ధర రూ. 57,999 ఉండగా.. దీనిపై ఇప్పటికే  కంపెనీ రూ. 8,000 భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది. అయితే రూ. 57,999 వేలు ఉన్న ఫోన్‌ ఈ డిస్కౌంట్‌తో రూ. 49,999 వేలకు అందుబాటులో ఉంది. అయితే  ఈ ఫోన్‌ పై ఇప్పటికే పలు బ్యాంకులు ఫ్లిప్ కార్ట్‌లో డిస్కౌంట్లు ప్రకటించాయి.  రియల్‌ మీ జీటీ 2 ప్రో పై హెడీఎఫ్‌సీ బ్యాంక్‌ ప్రత్యేకమైన డిస్కౌంట్‌ ఆఫర్‌ను ప్రకటించింది. హెడీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డ్‌తో తక్షణమే (Instant Discount ) రూ. 5000 వేలు  డిస్కౌంట్‌ పొందవచ్చు. అయితే 49,999 ఉన్న ధర ఈ డిస్కౌంట్‌తో 44,999కే లభించనుంది. 

ఆక్సిస్ బ్యాంక్‌ డిస్కౌంట్:
అదేవిధంగా ఎస్‌బీఐ బ్యాంక్‌ కూడా ప్రత్యేక అఫర్‌ పెట్టింది. ఎస్‌బీఐ బ్యాంక్‌ క్రెడిట్‌తో ఈ మొబైల్‌ను కొనుగోలు చేస్తే రూ. 5000 వేలు  ఇన్‌స్టన్ట్‌ డిస్కౌంట్‌లు పొందవచ్చు.  ఫ్లిప్ కార్ట్ ఆక్సిస్ బ్యాంక్‌పై తక్షణమే 5 శాతం డిసౌంట్ పొందవచ్చు. అయితే ఈ డిస్కౌంట్‌తో ఈ ఫోన్ రూ.42,000లకు పొందవచ్చు. ఇప్పటికే ఈ ఫోన్‌పై నోకాస్ట్ ఈఎమ్‌ఐని కూడా ఫ్లిప్ కార్ట్‌ ప్రకటించింది.   

రియల్‌ మీ జీటీ 2 ప్రో ప్రత్యేక ఫిచర్లు:
# 6.7  అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ 2K LTPO AMOLED డిస్‌ప్లే
# అడాప్టివ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120Hzతో.. డిస్‌ప్లే ప్రోటక్షన్‌ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ స్క్రీన్
# క్వాల్‌కామ్‌ లేటెస్ట్ (Snapdragon 8 Gen 1) ప్రాసెసర్‌
# బ్యాక్‌ కెమెరా సోనీ IMX766తో 102-మెగాపిక్సెల్(50+50+2MP)
# సెల్పీ కెమెరా 32MP
# 5,000mAh బ్యాటరీ 
# 65W సూపర్‌డార్ట్ ఛార్జ్

Also Read: Dewald Brevis: 'జూనియర్‌ ఏబీ'నా మజాకా.. వ‌రుస‌గా 4 సిక్సులు! ఐపీఎల్‌ 2022లోనే భారీ సిక్సర్‌ (వీడియో)!

Also Read: Krithi Shetty: చందమామలా మెరిసిపోతున్న కృతి శెట్టి.. బేబమ్మ అందాలకు కుర్రాళ్లు ఫిదా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News