RBI REPO RATE: భయపడుతున్నట్లే జరిగింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం ప్రభావం భారత్ పై పడింది. ఇతర దేశాల బాటలోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. వడ్డీ రేట్లను పెంచింది.ఇప్పటికే మూడు సార్లు రెపో రేట్ పెంచిన ఆర్బీఐ.. మరోసారి రెపో రేట్‌ను 50 బేసిస్ పాయింట్స్ పెంచింది.
ఆర్బీఐ తాజా నిర్ణయంతో వడ్డీ రేటు పెరిగి, సామాన్యులపై మరోసారి ఈఎంఐల భారం పడనుంది. ఈ వడ్డీ రేట్ల పెంపుతో గృహ, వాహన ఇతర రుణాల ఈఎంఐలు పెరగనున్నాయి.50 బేసిపాయింట్లు పెంచడంతో 5.9 శాతానికి వడ్డి రేటు చేరుకుంది.ఇటీవల ద్రవ్యోల్బణం భారీగా పడిపోయింది. దీంతో ఈ ఏడాది మే నుంచి వడ్డీ రేట్లను దశలవారీగా పెంచుతూ వస్తోంది. మే 4న 40 బేసిస్ పాయింట్స్, జూన్ 8న 50 బేసిస్ పాయింట్స్, ఆగస్ట్ 5న 50 బేసిస్ పాయింట్స్ వడ్డీ రేటు పెంచింది. తాజాగా మరో 50 బేసిస్ పాయింట్స్ వడ్డీ రేటు పెరిగింది. ఐదు నెలల్లో మొత్తం 190 బేసిస్ పాయింట్స్ అంటే 1.90 శాతం వడ్డీ రేటు పెరిగింది.
బుధ, గురువారాల్లో రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆర్థిక వృద్ధిపై శక్తికాంత దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు.ద్రవ్యోల్బణాకికి కళ్లెం వేసేందుకే వడ్డీ రేట్లు పెంచినట్లు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. ఇటీవలే అమెరికాలో కూడా వడ్డీ రేట్లను భారీగా పెంచింది యూఎస్ ఫెడ్ బ్రిటన్, స్విట్జర్లాండ్ సహా పలు అభివృద్ధి చెందిన దేశాలు కూడా వడ్డీ రేట్లను హైక్ చేశాయి.ఇది ఆర్థిక మందగమనం భయాలను మరింత పెంచింది. దీంతో ఇక భారత్‌లోనూ వడ్డీ రేట్ల పెంపు తప్పదనే సంకేతాలు అందాయి.అనుకున్నట్లే రెపో రేటు 50 పాయింట్లు పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది.
Read also: TRS VS MIM: పీకే బాటలోనే ఎంఐఎం.. కేసీఆర్ తో దోస్తీ కటీఫ్! 30 నియోజకవర్గాల్లో కారుకు గండం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.