RBI - 90 Rupees Silver Coin: RBI 90వ వార్షికోత్సవం సందర్భంగా 90 రూపాయల వెండి నాణెం విడుదల.. ప్రత్యేకతలు ఇవే..

RBI - 90 Rupees Silver Coin: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ప్రత్యేక నాణాలను విడుదల చేస్తూ ఉంటుంది. ఏప్రిల్ 1న రిజర్వ్ బ్యాంబ్ ఆఫ్ ఇండియా 90వ యేట అడుగుపెట్టింది. 90 యేళ్ల సందర్బంగా ఆర్బీఐ 90 రూపాయల ప్రత్యేక వెండి నాణాన్ని విడుదల చేసింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 3, 2024, 02:52 PM IST
RBI - 90 Rupees Silver Coin: RBI 90వ వార్షికోత్సవం సందర్భంగా 90 రూపాయల వెండి నాణెం విడుదల.. ప్రత్యేకతలు ఇవే..

RBI - 90 Rupees Silver Coin: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) 89 యేళ్లు పూర్తి చేసుకొని 90వ యేట అడుగు పెట్టింది. ఈ సందర్బంగా ఆర్బీఐ 90 రూపాయిల ప్రత్యేక వెండి నాణాన్ని విడుదల చేసింది. కొన్ని ప్రత్యేక సందర్బాల్లో ఆర్బీఐ ప్రత్యేకంగా కొన్ని నాణాలను విడుదల చూస్తూ ఉంటుంది. అప్పట్లో ఎన్టీఆర్ శత జయంతి పురస్కరించుకొని 100 రూపాయల వెండి నాణాన్ని విడుదల చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ నాణాన్ని ఎన్టీఆర్ అభిమానులు..ఆర్బీఐ ప్రత్యేక కౌంటర్స్ దగ్గర కొనుగోలు చేసారు. తాజాగా ఆర్బీఐ 90 యేళ్ల ప్రస్థానానికి గుర్తుగా 90 రూపాయల వెండి నాణెం విడుదల చేసింది.

ఈ నాణాన్ని నిన్న ఏప్రిల్ 2న విడుదల చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ నాణాన్ని 99.99 స్వచ్ఛమైన వెండితో ప్రత్యేకంగా తయారు చేసినట్టు ఆర్బీఐ వర్గాలు తెలిపాయి. ఈ నాణెం ప్రజలకు అందుబాటులో ఉండదు. కేవలం ఆర్బీఐ 90 యేళ్ల ప్రయాణానికి గుర్తుగా ఈ కాయిన్ విడుదల చేయడం విశేషం. ఈ నాణాన్ని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారు.  ఈ కార్యక్రమంలో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్, ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ సహా పలువురు కేంద్ర ప్రభుత్వ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 99.99 శాతం వెండితో ఈ నాణెన్ని తయారు చేసినట్టు చెప్పారు. అంతేకాదు ఈ నాణెం బరువు 40 గ్రాములు. ఈ నాణెంపై ఆర్బీఐ చిహ్నం ఉంది. ఈ నాణాన్ని ఆర్బీఐ 90 యేళ్ల ప్రస్థానానికి గుర్తుగా ప్రత్యేక జ్ఞాపకార్ధంగా తయారు చేశారు.

రిజర్వ్ బ్యాంక్ విషయానికొస్తే.. 1935లో ఏప్రిల్ 1న రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఈ బ్యాంక్‌ను నెలకొల్పారు. అది కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా యాక్ట్ ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది. స్వతంత్ర్యం అనంతరం 1949లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జాతీయం చేయబడింది. కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ కింద పనిచేయడం ప్రారంభం అయింది.

Also Read: KTR Vs Kishan Reddy: గాలికి గెలిచిన కిషన్‌ రెడ్డికి ఈసారి ఓటమే.. ఇదే నా ఛాలెంజ్‌: కేటీఆర్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News