Railway Luggage Rules: రైల్వే ప్రయాణీకులకు అవసరమైన అలర్ట్ ఇది. రైల్వే ప్రయాణీకులు తమ వెంట ఏ కేటగరీల ఏ మేరకు లగేజ్ తీసుకెళ్లవచ్చనే విషయంపై మరోసారి అడ్వైజరీ జారీ అయింది. రైల్వే ప్రకారం..
రైల్వే ప్రయాణం సమయంలో లగేజ్ సహజంగా ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి తోటి పాసెంజర్లకు ఇబ్బంది కలిగేంతగా లగేజ్ ఉంటుంది. ఈ విషయంపై రైల్వేకు చాలాసార్లు ఫిర్యాదులు చేరాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని..రైల్వే మరోసారి ప్రయాణీకుల లగేజ్ విషయంలో అడ్వైజరీ వెలువరించింది. ఇందులో ఏ కేటగరీలో ఎంత లగేజ్ తీసుకువెళ్లవచ్చనేది వివరించారు. నిర్ణీత పరిమాణం కంటే ఎక్కువ లగేజ్ ఉంటే జరిమానా కూడా విధించనున్నారు.
రిజర్వేషన్ కేటగరీ ప్రయాణీకులు లగేజ్ విషయంలో కాస్త సర్దుకోగలిగినా..సాధారణ భోగీల్లో మాత్రం సమస్య ఎదురౌతుంటుంది. ఎందుకంటే ముందు నుంచే ఈ కేటగరీలో నిర్ణీత సంఖ్య కంటే ఎక్కువ పాసెంజర్లు ప్రయాణిస్తుంటారు. ఫలితంగా లగేజ్ పెద్ద సమస్యగా మారుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ అడ్వైజరీ జారీ చేసింది.
రైలులో ప్రతి కేటగరీకు నిర్ణీత బరువు పరిమితి ఉంది. ఫస్ట్‌క్లాస్ కేటగరీలో ప్రయాణీకులు 70 కిలోల వరకూ లగేజ్ తీసుకెళ్లవచ్చు.సెకండ్ క్లాస్‌లో 50 కిలోలు, ధర్డ్ క్లాస్‌లో 40 కిలోలు, సాధారణ భోగీలో 35 కిలోల వరకూ లగేజ్‌కు అనుమతి ఉంటుంది. దీనికంటే ఎక్కువైతే మాత్రం పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.
అందుకే రైల్వే మరోసారి ప్రయాణీకులకు సూచనలు జారీ చేసింది. నిర్ణీత బరువు కంటే ఎక్కువ లగేజ్ తీసుకెళ్లవద్దని సూచిస్తోంది. అయితే రైల్వేలో లగేజ్ తూకే వ్యవస్థ లేకపోవడంతో ఈ నిబంధనలు చాలాకాలం నుంచి ఉన్నా..అమలుకు నోచుకోవడం లేదు.
Also read: Internet Speed: క్రమంగా ఇంటర్నెట్ వేగం తగ్గుతుందా..అయితే ఈ పని చేయండి..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook