PPF Updates: ఏప్రిల్ 5 కల్లా ఇన్వెస్ట్ చేయకుంటే భారీగా నష్టం, ఎంతంటే

PPF Updates: పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్‌కు సంబంధించి కీలకమైన అప్‌డేట్ ఇది. ఇందులో ఇన్వెస్ట్ చేసే ఆలోచన ఉంటే ఏప్రిల్ 5 నాటికి ఆ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. లేకపోతే భారీగా ఆర్ధిక నష్టం సంభవిస్తుంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 3, 2024, 05:12 PM IST
PPF Updates: ఏప్రిల్ 5 కల్లా ఇన్వెస్ట్ చేయకుంటే భారీగా నష్టం, ఎంతంటే

PPF Updates: పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్ స్థూలంగా చెప్పాలంటే పీపీఎఫ్ పథకంలో ఇన్వెస్ట్‌మెంట్ అనేది కేవలం భవిష్యత్ సంరక్షణకే కాకుండా ఇన్‌కంటాక్స్ మినహాయింపు ప్రయోజనం కూడా కల్పిస్తుంది. అయితే ఇందులో అధిక ప్రయోజనాలు పొందాలంటే కచ్చితంగా మీ ఇన్వెస్ట్ మెంట్ అనేది ఏప్రిల్ 5 నాటికి పూర్తి కావాలి. లేకపోతే చాలా నష్టపోవల్సి వస్తుంది. 

పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్ అనేది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జీరో రీస్క్ కూడిన అధిక రిటర్న్స్ అందించే పధకం. ప్రతి నెలా 5వ తేదీకు పీపీఎఫ్ వడ్డీ లెక్కగడుతుంటారు. ఒకేసారి పెద్దమొత్తంలో డబ్బులు డిపాజిట్ చేయాలని చూస్తుంటే మాత్రం ఏప్రిల్ 5 నాటికి పూర్తి చేయాలి. అప్పుడే వడ్డీ మొత్తం లభిస్తుంది. ప్రస్తుతం పీపీఎఫ్‌పై కేంద్ర ప్రభుత్వం 7.1 శాతం వడ్డీ చెల్లిస్తోంది. పీపీఎఫ్ అనేది 15 ఏళ్ల కాల పరిమితికి ఉంటుంది. ఏడాదికి 1.5 లక్షల చొప్పున ఇన్వెస్ట్ చేస్తుంటే  15 ఏళ్లకు  18.18 లక్షల వడ్డీ రూపంలో లభిస్తుంది. అయితే ప్రతియేటా ఏప్రిల్ 5కు ఇన్వెస్ట్‌మెంట్ పూర్తి కావాలి. 

అదే ఏప్రిల్ 5 తరువాత ఎవరైనా డిపాజిట్ చేస్తే ఆ వ్యక్తికి లభించే వడ్డీ కేవలం 15.84 లక్షలే. అంటే 2.69 లక్షలు నష్టపోవల్సి వస్తుంది. పీపీఎఫ్ ఎక్కౌంట్‌లో ఏప్రిల్ 15న డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే పీపీఎఫ్ నిబంధనల ప్రకారం వడ్డీ అనేది ఏప్రిల్ 5 నుంచి ఏప్రిల్ 30 వరకు ఉన్న బ్యాలెన్స్‌పై లెక్కిస్తారు. అందుకే ఏప్రిల్ 5 తరువాత డిపాజిట్ చేసే మొత్తంపై వడ్డీ వర్తించదు.  ప్రస్తుతం పీపీఎఫ్‌పై ప్రభుత్వం 7.1 శాతం వడ్డీ చెల్లిస్తోంది. ప్రతి నెల 5 వతేదీ నాటికి ఎక్కౌంట్‌లో ఎంత మొత్తం ఉందో దానిపైనే వడ్డీ లెక్కించి చెల్లిస్తారు. అందుకే పీపీఎఫ్‌లో డబ్బులు డిపాజిట్ చేయాలంటే 5వ తేదీనాటికి చేయాల్సి ఉంటుంది. 

Also read: Glass Symbol: కూటమి కొంప ముంచనున్న గాజు గ్లాసు, ఈసీని ఆశ్రయించనున్న జనసేన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News